యూకేలో ఆర్ట్ ఎగ్జిబిషన్.. మహారాజా దులీప్ సింగ్‌పై అభిమానం చాటుకున్న సిక్కు రచయిత

పంజాబ్ చివరి పాలకుడు మహారాజా దులీప్ సింగ్ పై అభిమానాన్ని చాటుకున్నారు బ్రిటీష్ సిక్కు చరిత్రకారుడు, ఆర్ట్ కలెక్టర్ .

దులీప్ సింగ్ విశేషాలు ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో తాను ఎంతో కష్టపడి సంపాదించిన కళాఖండాలను, వస్తువులను ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం ఇచ్చారు.

ఆయన పేరు పీటర్ బాన్స్.ఇప్పటికే దులీప్ సింగ్ జీవిత చరిత్రను Sovereign, Squire And Rebel: Maharajah Duleep Singh And The Heirs Of A Lost Kingdom' పేరిట రచించారు.

తూర్పు ఇంగ్లాండ్ లోని నార్విచ్ నార్ఫోక్ రికార్డ్ ఆఫీసులో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.

Maharajah Duleep Singh: Norfolk's Princely Family' పేరిట ప్రదర్శనను నిర్వహించారు.ఎగ్జిబిషన్ లో వుంచిన చారిత్రాత్మక వస్తువులలో అనేకం ప్రజల సందర్శనార్థం ప్రదర్శించబడటం ఇదే తొలిసారి.

వీటిని చూసి జనం సంతోషిస్తారని బాన్స్ ఆకాంక్షించారు.వీటిలో క్వీన్ విక్టోరియా సంతకం చేసి పంపిన జర్నల్ ఇందులో ఒకటి.

మహారాజా దులీప్ సింగ్‌కి విక్టోరియా మహారాణి 1868 మార్చిలో దీనిని పంపారు.బ్రిటీష్ ప్రభుత్వంతో పంజాబ్ సామ్రాజ్యం సన్నిహితంగా మెలిగింది.

ఈ ఎగ్జిబిషన్ వల్ల బ్రిటీష్ ఇండియా చరిత్ర నేటి యువతకు తెలియడంతో పాటు పరిశోధించేందుకు వీలు కలుగుతుందని బాన్స్ అన్నారు.

150 సంవత్సరాల క్రితం పంజాబ్ చివరి చక్రవర్తి.మహారాజా దులీప్ సింగ్ నార్ఫోక్ సఫోల్క్ సరిహద్దుల్లోని థెట్‌ఫోర్డ్ సమీపంలోని ఎల్వెడెన్ ఎస్టేట్ ను కొనుగోలు చేసినప్పుడు తూర్పు ఆంగ్లియాను తన నివాసంగా మార్చుకున్నారు.

"""/"/ థెట్ ఫోర్డ్ లోని ఎల్వెడెన్ మేనర్‌ లో చాలా ఏళ్ల పాటు దులీప్ సింగ్ నివసించారు.

దీనిపై సీమా ఆనంద్ అనే మహిళ ‘Punjab To Thetford' అనే చిత్రాన్ని రూపొందించారు.

బాన్స్ పరిశోధనల ప్రకారం.దులీప్ సింగ్ కుటుంబ వారసత్వం ఇప్పటికీ ఈ ప్రాంతంలో వుంది.

మహారాజా కుమారుడు ప్రిన్స్ ఫ్రెడ్రిక్ దులీప్ సింగ్ విరాళంగా ఇచ్చిన పురాతన భవనం, మూసివేతల నుంచి కాపాడిన ఎన్నో చర్చిలు ఇక్కడే వున్నాయి.

ప్రిన్స్ ఫ్రెడ్రిక్ నార్ఫోక్ యోమన్నీలో చేరాడు .తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేశాడు.

తర్వాత వారి యుద్ధ స్మారక చిహ్నాలను పునర్నిర్మించాడు.యువరాణి సోఫియా దులీప్ సింగ్, అతని సోదరిలు మహిళల ఓటు హక్కు కోసం పోరాడారు ఇకపోతే.

సెప్టెంబర్ వరకు నార్విచ్ లోని ఆర్కైవ్స్ సెంటర్ లో ఎగ్జిబిషన్ ను ఆంగ్లో పంజాబ్ హెరిటేజ్ ఫౌండేషన్ నిర్వహించనుంది.

ఎసెక్స్ కల్చరల్ డైవర్సిటీ ప్రాజెక్ట్ (ఈసీడీపీ) దాని క్రియేటివ్ డైరెక్టర్ ఇండి సంధూ మద్ధతుగా నిలిచారు.

Samantha : నాలో శక్తి తగ్గిపోయింది.. ఆ బాధ వర్ణించలేను సమంత కామెంట్స్ వైరల్!