సోలోగా అంటార్కిటికా యాత్ర.. చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ

భారత సంతతికి చెందిన బ్రిటీష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్‌ప్రీత్ చౌందీ రికార్డుల్లోకెక్కారు.

ఒంటరిగా ధ్రువ యాత్ర చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.పోలార్ ప్రీత్ అని పిలిచే కెప్టెన్ హర్‌ప్రీత్ చాందీ, దక్షిణ ధ్రువానికి ఒంటరిగా, ఎవరి సపోర్ట్ లేకుండా ట్రెక్కింగ్ రికార్డును నెలకొల్పిన తొలి భారత సంతతికి చెందిన మహిళగా రికార్డుల్లోకెక్కారు.

ఆ ఛాలెంజ్‌ను పూర్తి చేసి.మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అంటార్కిటికా మీదుగా 1397 కి.

మీ ప్రయాణించారు.తద్వారా 2020లో అంజా బ్లాచా నెలకొల్పిన 1381 కిలోమీటర్ల రికార్డును చాందీ బద్ధలు కొట్టారు.

గతేడాది నవంబర్ 22 నుంచి ఈ సాహసయాత్రలో భాగంగా తన కిట్‌తో ఆమె స్లెడ్జ్‌ను ఒంటరిగా లాగుతూ.

గడ్డకట్టే ఉష్ణోగ్రతలతో చాందీ పోరాడుతోంది.మూడేళ్ల క్రితమే ఆమె అంటార్కిటికా గురించి తెలుసుకున్నప్పుడు ఆ ఖండాన్ని దాటాలని నిర్ణయించుకుంది.

అయితే అంటార్కిటిక్ లాజిస్టిక్స్ అండ్ ఎక్స్‌పెడిషన్స్ (ఏఎల్ఈ)కి ఆమె ఎలాంటి దరఖాస్తు చేయలేదు.

అనుభవాన్ని సంపాదించాలనే లక్ష్యంతోనే చాందీ ఈ నిర్ణయం తీసుకున్నారు. """/"/ కాగా.

32 ఏళ్ల హర్‌ప్రీత్ చాందీ బ్రిటీష్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు.దక్షిణ ధృవాన్ని ఎవరి సాయం లేకుండా ఒంటరిగా చుట్టిరావాలని.

తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి మహిళగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుని దానిని సాధించారు.

దక్షిణ ధృవంపై మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి.

ఇలాంటి ప్రతికూల పరిస్ధితుల్లో తన కిట్‌ను లాక్కుంటూ 700 మైళ్లు వెళ్లారు.అంతేకాదు.

దక్షిణ ధృవంలో సోలోగా యాత్రను పూర్తి చేసిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా రికార్డుల్లోకెక్కారు ప్రీత్ చాందీ.

"""/"/ ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్ వాయువ్య ప్రాంతంలో ఉన్న మెడికల్ రెజిమెంట్‌లో సైన్యంలోని వైద్యులకు క్లినికల్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

లండన్‌లోని క్వీన్ మేరీస్ యూనివర్సిటీలో పార్ట్‌టైమ్‌లో స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్ మెడిసిన్‌లో చాందీ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

అంటార్కిటికా భూమిపై అత్యంత శీతలమైన, ఎత్తైన, పొడిగా, గాలులతో వుండే ఖండమని ఆమె చెప్పారు.

అక్కడ శాశ్వతంగా ఎవరూ నివసించరని.తొలుత తన ప్రణాళికను ప్రారంభించినప్పుడు ఆ ఖండం గురించి పెద్దగా ఏమి తెలియదని అదే తనను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించిందని గతంలో హర్‌ప్రీత్ తెలిపారు.

ప్రపంచంలోనే ఏకైక 10-స్టార్ హోటల్.. ఒక్క రాత్రికి ఎంత ఖర్చో తెలిస్తే..?