లండన్‌లో దేశీ ఫుడ్ తయారు చేస్తున్న బ్రిటిష్ వ్యక్తి.. వీడియో వైరల్..

మన భారతదేశంలో ఎన్నో టేస్టీ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి.ఇవన్నీ విదేశీయులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఇండియాకి వచ్చినప్పుడు వాటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు.అయితే కొందరు విదేశీయులు ఇక్కడి కొన్ని వంటకాల టేస్ట్ చూసి వాటిని నేర్చుకుంటారు.

తర్వాత తమ దేశంలోనే ఆ స్నాక్స్ తయారుచేస్తూ లోకల్ పీపుల్ కి ఆ రుచిని అందజేస్తుంటారు.

అది వారికి ఒక జీవనోపాధి కూడా కలిగిస్తుంది.ఇడ్లీ, దోసే, పకోడీ, జిలేబి (Idli, Dose, Pakodi, Jalebi)ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇండియన్ ఫుడ్స్ అనేక దేశాల్లో కూడా ఫుల్ ఫేమస్ అయ్యాయి.

ఈ నేపథ్యంలోనే లండన్‌లో మరో ఇండియన్ స్నాక్ (Indian Snack)కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.

కోల్‌కతా వీధుల్లో ఝల్మూరి (jhalmuri)అనే స్నాక్ ఉద్భవించింది.మొదటగా దాన్ని అక్కడైతే తయారు చేశారు.

అక్కడే ఫేమస్ అయి, తరువాత ఇండియా వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయింది.ఇది ఇప్పుడు లండన్ (london)వీధుల్లోనూ దర్శనమిస్తోంది.

మరమరాలు, రుచికరమైన కూరగాయలు, పులుపుగా ఉండే చట్నీ, వైవిధ్యమైన మసాలాల కలయికతో తయారయ్యే ఈ స్నాక్, నోరూరించే రుచిని అందిస్తుంది.

కోల్‌కతా రుచిని లండన్‌కు తీసుకువెళ్లిన ఈ స్నాక్, అక్కడి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

"""/" / లండన్ నగరంలో తిరుగుతూ ఫుడ్ వీడియోలు తీసే ఒక యువకుడు, ‘ఝల్మూరి ఎక్స్‌ప్రెస్’ (Jhalmuri Express)అనే ఆసక్తికరమైన ఆహార కేంద్రాన్ని కనుగొన్నాడు.

ఆ పేరు కంటే ఎక్కువగా అతనిని ఆకర్షించింది, దాన్ని తయారు చేసే బ్రిటిష్ వ్యక్తే!ఆ ఇంగ్లీషు వ్యక్తి భారతదేశంలోని స్ట్రీట్ ఫుడ్ కార్ట్‌లలా కనిపించే ఒక కార్ట్‌ను నడుపుతున్నాడు.

"""/" / ఈ వ్యక్తి కోల్‌కతా శైలిలోనే ఝల్మూరిని తయారు చేస్తున్న దృశ్యాన్ని ఆ యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చూపించాడు.

ఒక స్టీల్ బౌల్‌లో మరమరాలు లేదా బొంగు పేలాలు వేసి, ఆపై కొత్తిమీర, తరిగిన కూరలు, ఉల్లిపాయలు, మసాలాలు అన్నీ కలిపి ఒక పొడవైన కత్తితో సంప్రదాయ పద్ధతిలో కలుపుతున్నాడు.

చివరగా, నిమ్మరసం పిండి వేసి, కోల్‌కతాలో లాగే ఒక న్యూస్ పేపర్ లో చుట్టి వడ్డిస్తున్నాడు.

దీంతో పాటు ఇమ్లి చట్నీ, భూజియా, మసాలా కూడా ఇస్తున్నాడు.ఆ ఝల్మూరిని(Jhalmuri) తిన్న తర్వాత, ఆ యువకుడు అది నిజమైన కోల్‌కతా శైలి ఝల్మూరి అని అన్నాడు.

వార్2 మూవీకి ఆ ఫైట్ హైలెట్ కానుందా.. ఆ 15నిమిషాలు అభిమానులకు పూనకాలే!