యూకే కేంద్రంగా కొత్త ఎయిర్‌లైన్స్... బోర్డులో భారత సంతతి మహిళకు చోటు
TeluguStop.com
యూకే నగరమైన బర్మింగ్‌హామ్‌ను భారత్‌లోని అమృత్‌సర్‌తో కలిపేలా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోన్న కొత్త విమానయాన సంస్థ ‘‘హన్స్ ఎయిర్‌వేస్’’ బోర్డులో భారత సంతతికి చెందిన బ్రిటీష్ పీర్ బారోనెస్ ఉషా ప్రషార్ నియమితులయ్యారు.
కమ్యూనిటీ ఎయిర్‌లైన్‌గా బ్రాండింగ్ చేస్తూ.లండన్‌కి వెలుపల వున్న నగరాలను భారత్‌తో అనుసంధానించేలా దృష్టి సారిస్తున్నట్లు హన్స్ ఎయిర్‌వేస్ తెలిపింది.
ఇదిలావుండగా.ఉషా ప్రషార్ ప్రస్తుతం యూకే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)కి చైర్‌గా వ్యవహరిస్తున్నారు.
అలాగే సమాజం ఎదుర్కొంటోన్న సమస్యలపై చర్చించే విద్యా సంస్థ కంబర్ ల్యాండ్ లాడ్జ్‌కు కూడా ఆమె చైర్‌గా వున్నారు.
హన్స్ ఎయిర్‌వేస్ సీఈవో సత్నాం సైనీ గతవారం మాట్లాడుతూ.ప్రైవేట్ రంగం, ప్రజా వ్యవహారాలలో ఉషా ప్రహార్‌కు నిబద్ధత, అనుభవం వుందన్నారు.
సామాజిక సమస్యలపై ఆమె గళమెత్తుతారని సైనీ ప్రశంసించారు.విమానయానాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఉష ఆసక్తిగా వున్నారని ఆయన కొనియాడారు.
మా బోర్డులో చేరేందుకు ఆహ్వానాన్ని అంగీకరించడంతో పాటు మా దార్శనికతను పంచుకున్నందుకు సత్నాం సైనీ హర్షం వ్యక్తం చేశారు.
నేషనల్ లిటరసీ ట్రస్ట్, బీబీసీ వరల్డ్ సర్వీస్ ట్రస్ట్, రాయల్ కామన్‌వెల్త్ సొసైటీ, బ్రిటీష్ కౌన్సిల్ డిప్యూటీ చైర్‌తో పాటు బ్రిటన్‌లోని అనేక అంతర్జాతీయ సంస్థలలో ఉషా ప్రషార్ పలు హోదాల్లో పనిచేశారు.
అలాగే యూకే కమ్యూనిటీ ఫాండేషన్స్ (యూకేసీఎఫ్) గౌరవాధ్యక్షురాలిగా కూడా విధులు నిర్వర్తించారు.హన్స్ ఎయిర్‌వేస్ బోర్డులో చేరినందుకు తనకు సంతోషంగా వుందన్నారు ఉషా ప్రషార్.
దాని ప్రారంభ ప్రయాణంలో భాగం కావడం ఆనందంగా వుందని.సంస్థ విజయానికి అర్ధవంతమైన సహకారం అందిస్తానని ఆమె స్పష్టం చేశారు.
"""/"/
ఇకపోతే.హన్స్ ఎయిర్‌వేస్ విషయానికి వస్తే బ్రిటీష్ ఇండియన్ పెట్టుబడిదారులు అందించిన నిధులతో రెండు తరగతుల క్యాబిన్‌లను అందించాలని యోచిస్తోంది.
ఇందులో ఒకటి ఎకానమీ క్లాస్ (దీనిని ఆనంద్ అని పిలుస్తారు.ఇందులో 31 అంగుళాలు వుండే సీట్లు 274 వుంటాయి), రెండోది ప్రీమియం ఎకానమీ (దీనిని ఆనంద్ ప్లస్ అని పిలుస్తారు.
ఇందులో 56 అంగుళాలు వుండే 24 సీట్లు వుంటాయి).యూకే, ఇండియా సివిల్ ఏవియేషన్ శాఖల నుంచి అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాత బర్మింగ్‌హామ్- అమృత్‌సర్‌ల మధ్య వారానికి నాలుగు సార్లు విమానాలను నడపాలని హన్స్ ఎయిర్‌వేస్ భావిస్తోంది.
అలాంటి వాళ్లకు మాత్రమే పవన్ గుండెల్లో స్థానం.. ఎస్జే సూర్య క్రేజీ కామెంట్స్ వైరల్!