భారత సంతతి విద్యావేత్తకు బ్రిటన్ అత్యున్నత పురస్కారం

బ్రిటన్‌లో భారత సంతతి విద్యావేత్త, హౌస్ ఆఫ్ లార్డ్స్ పీర్ అజయ్ కుమార్ కక్కర్‌కు దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన ‘‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ (కేబీఈ)’’ అవార్డు వరించింది.

శుక్రవారం విడుదల చేసిన యూకే వార్షిక న్యూఇయర్ ఆనర్స్ లిస్ట్‌లో ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది.

57 ఏళ్ల అజయ్.లండన్ యూనివర్సిటీ కాలేజ్‌లో ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

హెల్త్ కేర్ నిపుణులుగా, వ్యవస్థాపకులుగా రాణిస్తున్న మరో 50 మంది భారత సంతతి ప్రముఖులకు కూడా ఈ న్యూఇయర్ హానర్స్ లిస్ట్‌లో చోటు కల్పించారు.

బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ పేరిట ప్రధాన చేసే అవార్డుల కమిటీకి ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వం వహిస్తారు.

అవార్డు గ్రహీతలు తమకు ప్రేరణ, వినోదాన్ని అందించారని ప్రధాని ప్రశంసించారు.యూకేతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాల్లో సేవలు అందించారని కొనియాడారు.

వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ అవార్డులు ఒక అవకాశమని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు """/" / లార్డ్ కక్కర్.

హౌస్‌లో సభ్యుడిగా, ప్రజారోగ్య, స్వచ్చంద సంస్థల వ్యవస్థకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ .అలాగే వైద్య రంగానికి ఎనలేని సేవలు చేశారు.

పబ్లిక్ హెల్త్, క్లినికల్ రీసెర్చ్‌లతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ సెలెక్ట్ కమిటీ, ఎన్‌హెచ్‌ఎస్‌కు చెందిన పలు కమిటీలో అజయ్ పనిచేశారు.

1,278 మందితో విడుదల చేసిన ఈ న్యూఇయర్ హానర్స్ లిస్ట్‌లో 78 మంది ఒలింపియన్లు, పారాలింపియన్లు, స్విమ్మర్స్ సహా పలువురు క్రీడాకారులు కూడా వున్నారు.

ఇక భారత సంతతి ప్రముఖుల విషయానికి వస్తే.‘‘కమాండర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్’’ (సీబీఈ)ని షాలినీ ఖేమ్కా, కమలేశ్ ఖుంటి, ప్రొఫెసర్ రవి ప్రకాశ్ మహాజన్, ప్రొఫెసర్ ఇక్బాల్ సింగ్ అందుకున్నారు.

ఇక ‘‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్‌’’లను అందుకున్న వారి విషయానికి వస్తే.

డాక్టర్ హింద్ పాల్ సింగ్ భుయ్, అల్పేష్ చౌహాన్, డాక్టర్ జపిందర్ ధేసి, దేవిందర్ సింగ్ ధిల్లాన్, నితిన్ గణత్ర, జగ్తార్ సింగ్ గిల్, శరత్ కుమార్ జీవన్, అమృతపాల్ సింగ్ మాన్ వున్నారు.

వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు… సంచలన వ్యాఖ్యలు చేసిన నికోలయ్?