మా డిమాండ్లు నెరవేర్చే వారికే ఓటు.. ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించిన బ్రిటీష్ హిందూ కమ్యూనిటీ

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రిషి సునాక్( Rishi Sunak ).

తద్వారా యూకేకు ప్రధానిగా నియమితులైన తొలి భారత సంతతి, తొలి దక్షిణాసియా వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు.

ఈ ఏడాది జూలై 4న ఆయన సారథ్యంలోనే కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికలను ఎదుర్కోనుంది.

ఈ నేపథ్యంలో బ్రిటీష్ హిందువులలోని ఒక విభాగం తమ డిమాండ్లు, ఆకాంక్షలను ప్రస్తావిస్తూ తొలిసారిగా ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించి అన్ని పార్టీలు దీనిని గుర్తించాలని కోరింది.

బీఏపీఎస్ స్వామి నారాయణ్ సంస్థ( BAPS Swami Narayan Institute ) (యూకే), చిన్మయ మిషన్ (యూకే), ఇస్కాన్ (యూకే) వంటి 29 ప్రముఖ హిందూ సంస్థల నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది యూకే రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది.2021 జనాభా లెక్కల ప్రకారం ఇంగ్లాండ్‌లో( England ) మూడవ అతిపెద్ద మతంగా ఉన్న హిందూ మతాన్ని 1.

02 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.బ్రిటీష్ హిందువులు ఇంగ్లాండ్, వేల్స్‌లలో 1,066,894 మంది ఉన్నారు.

మొత్తం జనాభాలో 1.6 శాతంగా ఉన్న వీరు ఎన్నికలలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నారు.

యూకేలోని హిందూ సంస్థలు ప్రారంభించిన ‘‘హిందూ మేనిఫెస్టో యూకే 2024 ’’( Hindu Manifesto UK 2024 )లో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని మతపరమైన ద్వేషపూరిత నేరంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

అనేక మంది పార్లమెంటరీ అభ్యర్ధుల మద్ధతుతో ఈ మేనిఫెస్టోలో యూకేలోని హిందూ ప్రార్థనా స్థలాల రక్షణ , సరసమైన విద్య, సమాన ప్రాతినిధ్యం, క్రమబద్దీకరించబడిన వలసలు, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సంరక్షణ, ధార్మిక విలువల గుర్తింపు, రక్షణ వంటి కీలక డిమాండ్‌లను పొందుపరిచారు.

"""/" / దాదాభాయ్ నౌరోజీ( Dadabhai Naoroji ) బ్రిటీష్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడిగా రికార్డుల్లోకి ఎక్కారు.

బొంబాయి, పార్సీ మూలాలున్న నౌరోజీ 1885లో కామా అండ్ కంపెనీకి వ్యాపార భాగస్వామిగా బ్రిటన్‌కు వెళ్లారు.

అంతకుముందే 1856 నుంచి 1865 వరకు యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో గుజరాతీ ప్రొఫెసర్‌గానూ ఆయన పనిచేశారు.

1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా .భారత స్వాతంత్య్రం కోసం దాదాభాయ్ కీలకపాత్ర పోషించారు.

ఆయనను ‘‘ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ’’గా పిలుస్తారు.ఇక ముంబైలో జన్మించిన మాంచెర్జీ భౌనాగ్రీ , నార్త్ - ఈస్ట్ బెత్నాల్ గ్రీన్ కోసం కన్జర్వేటివ్ ఎంపీగా 1895లో యూకే పార్లమెంట్‌కు ఎన్నికైన రెండవ భారతీయుడిగా నిలించారు.

1900లో గెలిచిన మాంచెర్జీ.1906లో మాత్రం ఓడిపోయారు.

"""/" / ప్రస్తుతం హిందూ సమాజం యూకే రాజకీయాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది.

2017 సార్వత్రిక ఎన్నికల్లో 8 మంది హిందూ ఎంపీలు బ్రిటీష్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

ప్రీతి పటేల్, అలోక్ వర్మ, తన్మంజీత్ సింగ్ ధేసీ, లార్డ్ స్వరాజ్ పాల్‌లు బ్రిటీష్ పార్లమెంట్‌లో భారత సంతతికి చెందిన కొందరు ప్రముఖ నాయకులు.

ఎన్టీఆర్, నీల్ కాంబో మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా.. భారీ రిస్క్ కు సిద్ధమయ్యారుగా!