బ్రిగ్జిట్ మార్పులు: రంగు మారుతున్న బ్రిటన్ పాస్‌పోర్ట్, మళ్లీ వెనక్కి

రిఫరెండాలు, ప్రజల అభిప్రాయాలు, నిపుణుల మేథోమథనం, చివరికి ఎన్నికల తర్వాత యూరోపియన్ యూనియన్ నుంచి ఈ ఏడాది జనవరి 31న బ్రిటన్ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.

బ్రెగ్జిట్ తర్వాత యూకేకు 11 నెలల ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది.ఈ పీరియడ్‌లో యునైటెడ్ కింగ్ డమ్ ఈయూ నిబంధనలను పాటించడంతో పాటు డబ్బులు కూడా చెల్లిస్తుంది.

అయితే బ్రిగ్జిట్ నేపథ్యంలో యూకే‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.వాటిలో ప్రధానమైనది ఇమ్మిగ్రేషన్ విధానం.

కొద్దిరోజుల క్రితం దేశానికి మేలు కలిగించేలా పాయింట్స్ బేస్డ్ విధానాన్ని బ్రిటన్ తీసుకొచ్చింది.

అదే సమయంలో ఇప్పటి వరకు ఉన్న మెరూన్ కలర్ పాస్‌పోర్టులు పోయి వాటి స్థానంలో నీలి రంగు పాస్‌పోర్టులు రానున్నాయి.

వచ్చే ఆరు నెలల్లో పాస్‌పోర్టులను దశలవారీగా మార్పు చేస్తారు.దీనిలో భాగంగా వచ్చే నెలలో నీలి రంగు పాస్‌పోర్టులను జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

1988లో తొలిసారిగా ఈ పాస్‌పోర్టులను ప్రవేశపెట్టారు. """/"/ తొలుత వీటి ముద్రను ఫ్రెంచ్ బహుళ జాతి సంస్థ థేల్స్‌కు ఇచ్చారు.

అయితే ఈ కాంట్రాక్ట్ వివాదాస్పదంగా మారడంతో దానిని రద్దుచేసి పోలండ్‌కు ఇచ్చారు.

యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించడం ద్వారా జాతి గుర్తింపును పునరుద్దరించడానికి, ప్రపంచంలో మనకు ఒక కొత్త మార్గాన్ని రూపొందించడానికి అవకాశం వచ్చిందని యూకే అంతర్గత వ్యవహరాశాల శాఖ మంత్రి ప్రీతి పటేల్ అన్నారు.

జాతీయ గుర్తింపును పునరుద్దరించడంలో భాగంలో ఐకానిక్ బ్లూ అండ్ గోల్డ్ డిజైన్‌కు తిరిగి వస్తామని బ్రిటన్ 2017లో ప్రకటించడం ఈయూలో అలజడికి కారణమైంది.

1921లో తొలిసారి నీలిరంగు పాస్‌పోర్ట్‌ను బ్రిటన్ ముద్రించింది.నాటి నుంచి 1988 వరకు ఇవే చలామణిలో ఉండేవి.

అనిల్ రావిపూడిని కొట్టిన వాళ్లకు భారీ ఆఫర్ ఇచ్చిన జక్కన్న.. షాక్ లో డైరెక్టర్!