టీ వర్క్స్ కు విద్యార్థులను తీసుకురండి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా అన్ని వర్గాల ప్రజలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
ఈ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla )లోని ఇల్లంతకుంట, హన్మాజీపేట్, దమ్మన్నపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థినులు వారి ఆవిష్కరణలను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు.
మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆ ఆవిష్కరణలను పరిశీలించి, వాటి పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినిలు పి,వినీల (మహిళా వంట మిత్ర ప్రాజెక్ట్ ), సహశ్ర ( హెల్పింగ్ హ్యాండ్ ఫర్ ఓల్డ్ ఏజీడ్ అవిష్కకర్త) , జే శ్రీనిధి ( బోండా తయారీ మిషన్) లను అభినందించారు.
టీ వర్క్స్ కు ఈ ముగ్గురు విద్యార్థులను తీసుకువస్తే ఆవిష్కరణ లపై మరోసారి లోతుగా చర్చించి మరింత ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దవచ్చో సమాలోచనలు చేయవచ్చునన్నారు.
చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటం తదితరులు పాల్గొన్నారు.
హెయిర్ రూట్స్ ను సూపర్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ గా మార్చే బెస్ట్ టానిక్ మీ కోసం!