పాలు విరిగిపోయాయా? పార‌బోయడం ఎందుకు ఇలా వాడేయండి!

దాదాపు అంద‌రి ఇళ్లల్లోనూ ఎప్పుడోక‌ప్పుడు పాలు విరిగిపోతుంటాయి.అలా విరిగిపోయిన పాల‌ను ఏం చేయాలో తెలియ‌క బ‌య‌ట పార‌బోసేస్తుంటారు.

కానీ, ఇక‌పై అలా చేయ‌కండి.ఎందుకంటే విరిగిపోయిన పాల‌ను ఎన్నో విధాలుగా వాడుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.విరిగిన పాల‌తో టేస్టీ టేస్టీ ప‌నీర్ చేసుకోవ‌చ్చు, య‌మ్మీ య‌మ్మీ కలాకండ్ చేసుకోవ‌చ్చు, ప‌కోడీ చేసుకోవ‌చ్చు, కేక్, డోనట్స్ వంటి వాటిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు.

అలాగే విరిగిన పాల‌ల్లో కొద్దిగా నీటిని క‌లిపి పెర‌టిలో ఉండే మొక్క‌ల‌కు పోయ‌వ‌చ్చు.

త‌ద్వారా మొక్క‌ల‌కు మంచి పోష‌ణ అంది అవి చ‌క్క‌గా ఎదుగుతాయి.విరిగిన పాలు చ‌ర్మ సౌందర్యాన్ని పెంచ‌డంలో అద్భుతంగా హెల్ప్ చేస్తాయి.

ఒక్కో సారి ఎండల దెబ్బ‌కు ముఖం కమిలి పోతుంది.అలాంట‌ప్పుడు విరిగిన పాల‌ను ముఖానికి ప‌ట్టించి రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

అనంత‌రం కూల్ వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే క‌మిలిన చ‌ర్మం మ‌ళ్లీ మామూలు స్థితికి వ‌స్తుంది.

"""/" / విరిగిన పాల‌ల్లో కొద్దిగా స్వ‌చ్ఛ‌మైన‌ తేనె క‌లిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్‌గా శుభ్రం చేసుకోవాలి.ఇలా చేడ‌యం వ‌ల్ల ముఖం కాంతి వంతంగా, మృదువుగా త‌యారు అవుతుంది.

మొటిమ‌ల‌ను వ‌దిలించ‌డంలోనూ విరిగిన పాలు స‌హాయ‌ప‌డ‌తాయి.విరిగిన పాల‌ల్లో పావు టేబుల్ స్పూన్ క‌స్తూరి ప‌సుపు, వ‌న్ టేబుల్ స్పూన్ చంద‌నం పొడి వేసి బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌ల‌పై అప్లై చేసి.అర గంట పాటు వ‌దిలేయాలి.

ఆపై వాట‌ర్‌తో చ‌ర్మాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి.ఇలా త‌ర‌చూ చేస్తే మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

విరిగిన పాల‌ను పెరుగుగా కూడా మార్చుకోవ‌చ్చు.అవును, విరిగిన పాల‌ను అలాగే నైటంతా వ‌దిలేస్తే.

తెల్లవారే స‌రికి చ‌క్క‌గా పెరుగు అవుతుంది.ఇక విరిగిన పాల‌ను సలాడ్ డ్రెస్సింగ్‌గా సైతం వాడొకోవ‌చ్చు.

ఐటీ జాబ్స్ కోసం ఇంత పోటీనా.. ఈ వీడియో చూస్తే స్టూడెంట్ల గుండెలు అదిరిపోతాయి!