కోట్లతో నిర్మించిన బ్రిడ్జి,నెలరోజులు కాకుండానే….

నాసిరకం కట్టడాలతో కాంట్రాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు అని తెలపడానికి ఈ తాజా ఉదంతమే ఉదాహరణగా చెప్పాలి.

రుతుపవనాల కారణంగా వర్షాలు,వరదల తో అక్కడ నదులు,సాగునీటి ప్రాజెక్టులకు జల కళ మొదలైంది.

అయితే ఈ క్రమంలో ఇటీవల బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లా లో గండక్ నదిపై నిర్మించిన ఒక బ్రిడ్జ్ కనీసం నెలరోజులు కాకుండా కూలిపోయిన ఘటన కలకలం రేగింది.

బీహార్ రాష్ట్రంలోని సివాన్.శరణ్ జిల్లాల్లోని తూర్పు చంపారన్ నుంచి గోపాల్ గంజ్ ల మధ్య దూరం తగ్గించేందుకు ఇటీవల గంఢక్ నదిపై రూ.

263 కోట్ల వ్యయం తో బ్రిడ్జి ని నిర్మించారు.ఇటీవలే అనగా గత నెల 16 న ఈ బ్రిడ్జి ని బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు కూడా.

అయితే కనీసం ఈ బ్రిడ్జి ప్రారంభించి నెల రోజులు కాకుండానే కూలడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

వంతెన నిర్మాణంలో లోపాల కారణంగా ప్రారంభించిన నెల రోజుల్లోనే ఈ వంతెన వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది.

పలు జిల్లాలను కలిపే ఈ వంతెన వరద నీటికి కొట్టుకుపోవడం తో ఆ బ్రిడ్జి పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

అయితే నిర్మించిన బ్రిడ్జి కేవలం నెల రోజులు కాకుండానే కూలిపోవడం పై స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క విపక్షాలు సైతం ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నాయి.నాణ్యతా లోపం కారణంగానే కేవలం నెలరోజులు కూడా కాకుండానే బ్రిడ్జి కూలిపోయింది అని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆరోపించారు.

ఇలాంటి నాసిరకం కట్టడాలు కట్టిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలటూ డిమాండ్ చేశారు.

గురుపత్వంత్ హత్యపై అంతర్జాతీయ మీడియాలో కథనం.. స్పందించిన అమెరికా