డాగ్ ట్రైనర్ వెడ్డింగ్ కు డ్యాన్స్ కట్టిన పెట్ డాగ్

సోషల్ మీడియా లో నిత్యం ఎదో వీడియో సెన్సేషన్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

మొన్నటికి మొన్న టర్కీ లో ఒక చిన్నారిని రెండస్తుల భవనం నుంచి పడిపోతుండగా ఒక యువకుడు పట్టుకున్న వీడియో, నిన్న రైలింగ్ వద్ద పడిపోతున్న కన్న బిడ్దను కాపాడుకున్న తల్లి.

ఇండోనేసియా లో జరిగిన ఈ ఘటన కు సంబందించిన వీడియో కూడా తెగ లైక్ లు సంపాదించుకుంది.

అయితే ఇప్పుడు తాజగా మరో వీడియో సోషల్ మీడియా లో సెన్సేషనల్ అవుతుంది.

సెలబ్రిటీ డాగ్ ట్రైనర్ సారా కార్సన్ డివైన్ తన వెడ్డింగ్ రోజున తన కుక్కతో కలిసి డ్రాన్స్ ఫ్లోర్‌పై అదరగొట్టింది.

ఒకప్పుడు అమెరికా గాట్ టాలెంట్ లో చేసిన సారా తన వెడ్డింగ్ సందర్భంగా తన పెట్ డాగ్ హీరో తో ఎయిటీస్ హిట్ సాంగ్ ఫుట్ లూజ్ కి డ్యాన్స్ చేసింది.

ఆ వీడియో లో కుక్క కూడా సారా కు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

ఈ వీడియోను ఆమె మేనేజర్ పేస్ బుక్ లో షేర్ చేయడం తో ఇప్పుడు ఈ వీడియో దాదాపు 10 లక్షల వ్యూస్ సంపాదించుకుంది.

ఆ తర్వాత అదే వీడియో ఇన్‌స్టాగ్రాంలో కూడా దుమ్మురేపుతోంది.ఆడియన్స్ ముందు ఏమాత్రం బెదురు లేకుండా చక్కగా పెర్ఫార్మ్ చేసింది.

సారా చెప్పినట్లు వింటూ ఆమె చేస్తున్న సైగల్ని తెలుసుకుంటూ, అప్పటికప్పుడు కొత్త కొత్త స్టెప్పులు వేసిందీ.

ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.iframe Width="560" Height="315" Src="https://!--wwwyoutube!--com/embed/Jhtwn_zvH5U" Frameborder="0" Allow="accelerometer; Autoplay; Encrypted-media; Gyroscope; Picture-in-picture" Allowfullscreen/iframe.