పెళ్లయిన రెండో రోజే పెళ్లికూతురు డబ్బు నగలతో జంపు.. వరుడికి ఫోన్ చేసి చెప్పినా ట్విస్ట్!

నేటి సమాజంలో సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఏ పెళ్లి చూసినా పెళ్లయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకుని విడిపోతున్నారు.

కొంతమంది సామాన్యుల జీవితాలలో అయితే పెళ్లి అయిన ఒకటి రెండు రోజుల్లోనే వధువు లేక వరుడు పారిపోవడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రస్తుత సమాజంలో జీవిస్తున్న యువతకు పెళ్లిళ్లు అంటే ఒక ఆటలాడే పనిగా వీరందరూ భావిస్తున్నారు.

ఇలాంటి ఒక సంఘటనలో పెళ్లి జరిగిన ఆ తర్వాత రోజే పెళ్లి కొడుకుకి మస్కా కొట్టిన ఒక వధువు.

ఇంట్లోని డబ్బులు, బంగారు ఆభరణాలతో పరారైంది.ఆ తర్వాత వరుడికి ఫోన్‌ చేసి తన కోసం వేచి చూడొద్దని తెగేసి చెప్పి ట్విస్ట్ ఇచ్చింది.

కాల్ చేసిన ఆ పెళ్లికూతురు నేను నిన్ను ప్రేమించలేదు నువ్వు నాకు మళ్ళీ మళ్ళీ కాల్ చేయవద్దు అని చెప్పి కాల్ ను కట్ చేసింది.

ఇలాంటి విచిత్రమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్లో జరిగింది.ఈ సంఘటన అక్టోబర్‌ 4వ తేదీన బిల్హార్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం వరుడు ఫిర్యాదు చేసిన క్రమంలో వెలుగులోకి వచ్చింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కాన్పూర్ జిల్లాలోని జదేపూర్‌ గ్రామానికి చెందిన అరవింద్‌ను తాత్కౌలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి పెళ్లి కుదురుస్తామని చెప్పారు.

అందుకోసం రూ.70వేలు ఇవ్వాలి చెప్పారు.

డబ్బులు తీసుకున్నాక అరవింద్‌ను బిహార్‌ తీసుకెళ్లి రుచి అనే యువతితో పెళ్లి నిర్ణయించారు.

"""/"/ సెప్టెంబర్‌ 30న హోటల్‌కు తీసుకెళ్లి పెళ్లి కూతురి ఫోటో చూపించి,అక్టోబర్‌ 1న గయాలోని ఒక దేవాలయంలో పెళ్లి చేశారు.

అక్టోబర్‌ 4న తెల్లవారి నిద్రలేచే సరికి ఇంట్లో ఉంచిన రూ.30వేల నగదు, బంగారు నగలు, పెళ్లి కోసం తీసుకున్న బట్టలు సైతం తీసుకొని పెళ్లి కూతురు ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు తేలుసుకున్నాడు.

ఆ తర్వాత అరవింద్‌కు రుచి ఫోన్‌ చేసి తన కోసం వెతకొద్దని చెప్పిన్నట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతితో పాటు పెళ్లి కుదిర్చిన ఇద్దరు వ్యక్తులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని వెల్లడించారు.

ఐటీ జాబ్స్ కోసం ఇంత పోటీనా.. ఈ వీడియో చూస్తే స్టూడెంట్ల గుండెలు అదిరిపోతాయి!