నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని వధువు...
TeluguStop.com
ప్రస్తుతం కొందరికి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం అలవాటుగా మారిపోయింది.దీనివల్ల తమ అనుకున్న వారి జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు.
తాజాగా ఓ యువతి మరో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలోని లాలాపేటకు చెందినటువంటి ఓ యువతికి ఈ మధ్యనే ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది.
అయితే ఈ వివాహం 13వ తారీఖున జరిపేందుకు పెద్దలు ఏర్పాట్లలో ఉండగా వధువు అనుకోకుండా షాక్ ఇచ్చింది.
అయితే వధువు తల్లిదండ్రులు పని నిమిత్తమై బయటకు వెళ్లడంతో యువతి ఒక్కతే ఇంట్లో ఉంది.
అయితే పని ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి తల్లిదండ్రులు తలుపులు తెరచి చూడగా యువతి ఫ్యాన్ కి ఉరి వేసుకొని విగతజీవిగా వేలాడుతూ ఉంది.
దీంతో ఆ యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు.అంతేకాక ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లాల్సిన కూతురు ఇలా అనుమానాస్పదంగా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.
"""/"/
సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి యువతి మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
అలాగే మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన టువంటి వివరాల ఆధారంగా ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆ సినిమాకు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్.. భారీ స్థాయిలో కలెక్షన్లు ఖాయమా?