సూసేకి పాటకు వధువు క్యూట్ డ్యాన్స్.. వీడియో వైరల్..

"పుష్ప 2: ది రూల్"( Pushpa 2 The Rule ) సినిమాలోని "సూసేకి" పాట( Sooseki Song ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఈ పాటకు అందరూ కాలు కదుపుతూ రీల్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఓ వధువు( Bride ) కూడా తన పెళ్లిలో ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది.

ఈ పెళ్లి వేడుకలో వధువు తన వరుడుతో కలిసి "సూసేకి" పాటకు వేసిన స్టెప్పులు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ, ఆ జంట "సూసేకి" పాటలోని సిగ్నేచర్ స్టెప్పులను అచ్చు గుద్దినట్టు దింపేసింది.

వారి డ్యాన్స్( Dance ) చూసిన వాళ్లంతా ఫిదా అయిపోయారు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"""/" / ఈ వీడియోకి ఇప్పటికే మిలియన్ వ్యూస్ వచ్చాయి.షేర్లయితే లెక్కే లేదు.

"డ్యాన్స్ అదిరిపోయింది", "ఈ డ్యాన్స్ చూస్తుంటే ఎవరికైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఒకరైతే "కంగ్రాట్స్, ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి" అని కామెంట్ చేస్తే, మరొకరు "ఈ వీడియో చూస్తుంటే నాకెందుకో సిగ్గుగా ఉంది" అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.

మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్‌గా మారింది. """/" / 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాకి "పుష్ప: ది రైజ్"( Pushpa The Rise ) సీక్వెల్.

ఇది డిసెంబర్ 5న విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.సినిమా కథ, సుకుమార్ దర్శకత్వం, అల్లు అర్జున్( Allu Arjun ) నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

ఇకపోతే శ్రేయా ఘోషల్ పాడిన "సూసేకి" పాటతో పాటు సినిమాలోని డైలాగులు కూడా బాగా పాపులర్ అయ్యాయి.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఒక కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫేమస్ "వైల్డ్‌ఫైర్ హూ" డైలాగ్‌ను చెప్పడంతో అది కూడా వైరల్ అయింది.

పాటలు, డైలాగులు, పెళ్లి వేడుకల ద్వారా పుష్ప క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.పుష్ప ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు!.

మంచు మనోజ్ కు షాకిచ్చేలా లేఖ రాసిన తల్లి.. ఈ హీరో ఒంటరివాడు అవుతున్నాడా?