Breast Cancer : మహిళలలో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందే..!

రొమ్ము క్యాన్సర్( Breast Cancer ) వంటి తీవ్రమైన వ్యాధి చాలామంది ఆడవారిలో కనిపిస్తుంది.

కానీ చాలా మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అసలు తెలియదు.శరీరంలో కొన్ని మార్పులు కనిపించిన ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తారు.

ఈ లక్షణాలు మహిళల్లో కనిపిస్తే బెస్ట్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత జీవనశైలి మరియు మారిన ఆహార అలవాట్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉన్నాయి.

ఈ రోజులలో ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులు మరియు వివిధ రకాల క్యాన్సర్( Cancer ) వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.

అలాగే గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత సాధారణ క్యాన్సర్ రోగాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.

అలాగే ప్రతి ఏడాది 2.1 మిలియన్ల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

రొమ్ము యొక్క పాలన ఉత్పత్తి చేసే గ్రందులలో లేదా గ్రంధుల నుంచి చనుమొనలకు పాలను రవాణా చేసే నాళాలలో ఈ క్యాన్సర్ ఏర్పడుతుంది.

రొమ్ము యొక్క కొవ్వు లేదా పీచుతో కూడిన బంధన కణజాలం క్యాన్సర్ కణాలకు హాట్స్పాట్ గా ఉంటుంది.

"""/"/ కొన్ని సందర్భాలలో క్యాన్సర్ కణాలు మీ చేతుల కింద ఉన్న శోషరస కణపులకు చేరుతాయి.

అంతేకాకుండా శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఈ క్యాన్సర్ ను ముందుగా గుర్తించి చికిత్స చేసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణజాలం నుంచి అభివృద్ధి చెందే క్యాన్సర్ అని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే రొమ్ము పరిమాణం లేదా ఆకృతిలో మార్పు ఉంటుంది.కొమ్ము సున్నితత్వం, చాతి చుట్టూ చిన్న బటాని లాంటి ముద్దులు ఏర్పడతాయి.

బహిష్టు సమయంలో చంకలలో లేదా రొమ్ము చుట్టూ గడ్డలు కనిపిస్తాయి. """/"/ చంకలోని రెండు భాగాలలో ఒక ముద్ద లేదా వాపు కనిపిస్తుంది.

చాతి చర్మంలో తీవ్రమైన మార్పు ఏర్పడుతుంది.రొమ్ము లేదా ఉరుగుజ్జుల చర్మం లో మార్పులు కనిపిస్తాయి.

ఉరుగుజ్జులు నుంచి కొద్దిగా రక్తస్రావం( Bleeding ) అవుతుంది.చర్మం ఎరుపు లేద నారింజరంగు లోకి మారుతుంది.

ఈ లక్షణాలలో కొన్నిటిని మీరు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

యూఎస్ గ్రీన్ కార్డ్‌.. భారత సంతతి వైద్యులను పట్టించుకోండి : ఎన్ఆర్ఐ డాక్టర్ల సంఘం