బ్రేకింగ్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మల్లు రవికి నోటీసులు

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ మేరకు ఈనెల 12న విచారణకు హాజరు కావాలని మల్లు రవికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన విషయం తెలిసిందే.

కాగా కాంగ్రెస్ వార్ రూమ్ కి తానే ఇంచార్జ్ నని మల్లు రవి గతంలో చెప్పుకున్నారు.

అయితే, తెలంగాణ గళం పేరుతో ఫేస్‌బుక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారంచేస్తున్నారనే అభియోగాలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

యూకే యూనివర్సిటీలలో శాలరీలు ఇంత తక్కువా.. ఎన్నారై ప్రొఫెసర్ ఆవేదన!