‘లియో’ సినిమా విడుదలకు బ్రేక్.. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్
TeluguStop.com
ఇళయ దళపతి విజయ్ నటించిన లియో సినిమా విడుదలకు బ్రేక్ పడింది.ఇప్పటికే అడ్వాన్స్ బుక్సింగ్స్ లో రికార్డ్ సృష్టించిన ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధమైంది.అయితే చిత్ర యూనిట్ కు హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది.
ఈ సినిమాను 20వ తేదీ వరకు రిలీజ్ చేయొద్దని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది.
కాగా తెలుగులో లియో టైటిల్ ను ఉపయోగించడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈనెల 20 వరకు తెలుగులో విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ట్రంప్ దెబ్బకి అమెరికాలో భారీగా పెరుగుతున్న సిజేరియన్లు.. భారతీయ తల్లులు పరుగులెందుకు?