రాజా గౌతమ్, అనిల్ మోదుగ, సుబ్బు చెరుకూరి సర్వైవల్ థ్రిల్లర్' బ్రేక్ అవుట్' ఫస్ట్ లుక్ విడుదల

అనిల్ మోదుగ ఫిలిమ్స్ బ్యానర్ పై దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం గారి తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ నిర్మిస్తున్న చిత్రం బ్రేక్ అవుట్.

సర్వైవల్ థ్రిల్లర్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

కిటికీ నుండి బయటికి చూస్తూ బిగ్గరిగా అరుస్తన్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ క్యురియాసిటీని పెంచింది.

చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఇతర కీలకపాత్రలు పోహిస్తున్నారు.

ఈ చిత్రానికి మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా జోన్స్ రూపర్ట్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు .

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?