ఆ దేశంలో భారత విమానాలకు బ్రేక్.. !
TeluguStop.com
కరోనా వచ్చిన మొదట్లో ఈ వైరస్ ఇతరదేశాల్లో సృష్టిస్తున్న భీభత్సానికి మనదేశ వాసులందరు ఎంతో సానుభూతి తెలిపారు.
ఆయ్యో పాపం చైనాలో, ఇటలీలో అయితే కరోనాతో మరణించిన శవాలు కుప్పలు కుప్పలుగా వేస్తున్నారట.
దహన సంస్కారాలకు కూడా నోచుకోవడం లేదట.ఇంకా ఇంకా ఇలాంటి మాటలు ఎన్నో పలికాం.
కానీ ఇవేమాటలు ప్రస్తుత పరిస్దితుల్లో ప్రపంచ దేశాలు మన దేశాన్ని చూస్తూ అంటున్నాయి.
ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో రోగ నిరోధక శక్తి అనే మాట అటకెక్కగా, కరోనా బారిన పడుతున్న జనం ఎక్కువవుతున్నారు.
మరణాల సంఖ్య కూడా ఇదే స్దాయిలో కొనసాగుతుంది.అందు వల్ల ప్రస్తుత పరిస్దితుల్లో ప్రపంచ దేశాలు ఇండియా మీద ఆంక్షలు పెడుతున్నాయి.
ఈ క్రమంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది.భారత్ నుంచి నెదర్లాండ్స్ వెళ్లే అన్ని ప్యాసింజర్ విమానాలపై నిషేదం విధించింది.
ఇక సోమవారం నుంచి మే1 వరకు ఈ నిషేదం అమలులో ఉంటుందని డచ్ ఏవియేషన్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది.
విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు