తెలంగాణాలో డయాగ్నస్టిక్ సెంటర్స్ కు బ్రేక్..!
TeluguStop.com
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
జూన్ 7 సోమవారం 19 జిల్లాల్లో 19 డయాగ్నస్టిక్ సెంటర్స్ ఓపెన్ చేయాలని నిర్ణయించారు.
కాని ఆ జూన్ 7న ఆ కార్యక్రమానికి బ్రేక్ పడినట్టు తెలుస్తుంద్.జూన్ 7 నుండి జూన్ 9న డయాగ్నస్టిక్ ఓపెనింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నారట.
19 సెంటర్స్ లో ఓకేసారి ఈ సేవలను ప్రారంభించాలని సీఎం కే.సి.
ఆర్ ఆదేశించారు.19 సెంటర్స్ లో మంత్రులు, ముఖ్య అధికారుల చేత డయాగ్నస్టిక్ సెంటర్స్ ఓపెన్ చేయనున్నారు.
ఆల్రెడీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఈ డయాగ్నస్టిక్ సెంటర్స్ కోసం ఇదివరకే ఏర్పాట్లు సిద్ధం చేశారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని చెబుతున్నారు.తెలంగాణా లో కరోనా లాక్ డౌన్ కొనసాగుతుండగా జూన్ 7న అనుకున్న డయాగ్నస్టిక్ ఓపెనింగ్ ప్రోగ్రాం రెండు రోజులు వాయిదా వేశారు.
మంత్రులు ఉన్న చోట వారితో వారు లేకపోతే ఇతర ప్రముఖులతో ఈ డయాగ్నస్టిక్ సెంటర్స్ ఓపెన్ చేయిస్తారని తెలుస్తుంది.
కచ్చితంగా ప్రజలకు ఈ డయాగ్నస్టిక్ సెంటర్స్ అందుబాటులో ఉంటాయని చెప్పొచ్చు. ఈ డయాగ్నస్టిక్ సెంటర్స్ లో 57 రకాల టెస్టులు అందుబాటులో ఉంటాయని వైద్య అధికారులు చెబుతున్నారు.
ఐదు వేల కోట్లతో అమెజాన్ వ్యవస్థాపకుడి జెఫ్ బెజోస్ రెండో పెళ్లి