విడాకుల కోసం కోర్టుకెక్కిన లండన్ మహిళ.. ఎవరి నుంచో తెలిస్తే మైండ్ బ్లాక్..?
TeluguStop.com
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ విచిత్రమైన కథ వైరల్‌గా మారింది.అదేంటంటే, ఒక మహిళ తననే తాను వివాహం చేసుకుని, తర్వాత విడాకులు తీసుకుంది.
బ్రెజిల్‌కు( Brazil ) చెందిన 36 ఏళ్ల మోడల్ సుయెల్లెన్ కేరీ( Suellen Carey ) గతేడాది లండన్‌లో తననే తాను పెళ్లి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
ప్రేమించే వ్యక్తిని కనుక్కోలేకపోతున్నందున ఈ విచిత్ర నిర్ణయం తీసుకుంది.తనను తాను ప్రేమించుకోవడం, స్వతంత్రంగా ఉండటం అనే భావనను తెలియజేయడానికి ఈ వివాహం చేసుకున్నట్లు ఆమె చెప్పింది.
"""/" /
తనను తాను వివాహం చేసుకున్న సంవత్సరం తర్వాత, సుయెల్లెన్ తన నుంచి తానే విడాకులు( Divorce ) తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ వివాహాన్ని కొనసాగించడానికి ఎంతో ప్రయత్నించింది.ఒంటరిగా కౌన్సెలింగ్ కూడా చేయించుకుందట.
కానీ ఆ వివాహం కొనసాగించడం కష్టమేనని నిర్ణయించుకుంది.తనను తాను వివాహం చేసుకున్నందుకు మొదట్లో ఎంతో సంతోషించినప్పటికీ, ఆ వివాహం సమయంలో ఎప్పుడూ ఒంటరిగా భావించానని, అందుకే ఈ కష్ట నిర్ణయం తీసుకున్నానని సుయెల్లెన్ అంగీకరించింది.
"""/" /
సెల్ఫ్ లవ్, సెల్ఫ్ మ్యారేజ్( Self-Marriage ) గురించి ఒక ఇంటర్వ్యూలో సుయెల్లెన్ మాట్లాడింది.
నాకు నేను పర్ఫెక్ట్‌గా ఉండాలని ఎప్పుడూ అనుకునేదాన్ని ఆ ఒత్తిడి వల్ల నేను చాలా అలసిపోయా.
సెల్ఫ్ అనాలిసిస్, రిఫ్లక్షన్ చాలా అవసరం' అని ఆమె చెప్పింది.తనకు తాను చేసుకున్న ప్రామిస్‌లు నిలబెట్టుకోవడం కూడా కష్టమేనని అంగీకరించింది.
సొంత బాడీతో ఉన్న సంబంధాన్ని ఎప్పుడు ముగించాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమని సుయెల్లెన్ చెప్పింది.
10 కౌన్సెలింగ్ సెషన్ల తర్వాత తన నుంచే తానే విడాకులు తీసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది.
ఈ సెషన్లలో తన భావాలను పరిశీలించి, తనను తాను వివాహం చేసుకున్న సంబంధంలోని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించింది.
చివరకు, వివాహం ముగించడమే ముందుకు సాగే మార్గమని ఆమె గ్రహించింది.ఇప్పుడు సెల్ఫ్ మ్యారేజ్ పీరియడ్ ను గాయాలు మానడానికి, తన గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడిన సమయంగా ఆమె భావిస్తోంది.
ఇది తన హృదయాన్ని కొత్త అవకాశాలకు తెరిచి, పార్ట్‌నర్ ను కనుగొనే అవకాశానికి సిద్ధం చేసింది.
ఈవిడ విచిత్ర ప్రేమ, పెళ్లి, విడాకుల స్టోరీ గురించి తెలుసుకుని అందరూ షాక్ అవుతున్నారు.
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)