43 ఏళ్ల క్రితం చనిపోయిన చిన్నారి పేరుతో విదేశీ పౌరసత్వం.. త‌రువాత ఏం చేశాడో తెలిస్తే..

1979లో అంటే దాదాపు 43 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ చిన్నారి పేరుతో నట్వర్ లాల్ విలాస‌వంత‌మైన జీవితం గడిపాడు.

ఆ చిన్నారి పేరుతో వేరే దేశ పౌరసత్వం తీసుకున్నారు.20 ఏళ్లుగా విదేశీ ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు.

ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు కొన్నాడు.అయితే అబ‌ద్దాల జీవితం ఎన్నాళ్లో దాగ‌ద‌న్న‌ట్లు పోలీసుల‌కు ఎట్ట‌కేల‌కు పట్టుబ‌డ్డాడు.

అరెస్టయిన నట్వర్‌లాల్ అస‌లు పేరు రికార్డో సీజర్ గుడెస్.రికార్డో వయసు ఇప్పుడు 49 ఏళ్లు.

ఇత‌ను విలియం ఎరిక్సన్ లాడ్ పేరుతో అత‌ని ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌తో జీవితాన్ని గడుపుతున్నాడు.

విలియం ఎరిక్సన్ 1979లో నాలుగైదు సంవత్సరాల వయసులో మరణించాడు.విలియం ఎరిక్సన్ లాడ్.

అమెరికాలోని అట్లాంటాకు చెందిన బాలుడు.డైలీ స్టార్ అందించిన వివ‌రాల ప్ర‌కారం రికార్డో 43 సంవత్సరాల క్రితం మరణించిన పిల్లవాని గుర్తింపుతో త‌న వివాహాన్ని కూడా నమోదు చేశాడు.

దీనిని కొన్నిరోజుల క్రితం స్థానిక వార్తాపత్రిక హ్యూస్టన్ క్రానికల్‌లో ప్రచురించింది.ఈ విష‌యం వెలుగు చూసిన నేప‌ధ్యంలో ఈ మోసగాడిపై టెక్సాస్ కోర్టులో కేసు న‌మోద‌య్యింది.

"""/" / విలియం ఎరిక్సన్ వాషింగ్టన్‌లో మరణించాడు.తాను 1990లలో బ్రెజిల్ నుంచి అమెరికాకు వచ్చినట్లు రికార్డో అంగీకరించాడు.

ఆ తర్వాత టూరిస్ట్ వీసాపై అమెరికా చేరుకున్నాడు.1998లో, అతను విలియం ఎరిక్సన్ పేరు మీద పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

టెక్సాస్‌లోని లేక్ హ్యూస్టన్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.అక్కడే ఓ ఫ్లాట్ కూడా కొన్నాడు.

చివ‌రికి ఆ ఫ్లాట్‌ని కూడా ఈ మోసగాడు విలియం పేరుతోనే కొన్నాడు.యునైటెడ్ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన 40 విమానాల్లో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన రికార్డో ఇటీవల ఒక కేసులో పట్టుబడడంతో అత‌ని మోసాల చిట్టా బ‌య‌ట‌ప‌డింది.

అమెరికాలోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిప్లమాటిక్ సెక్యూరిటీ సర్వీస్ (డీఎస్‌ఎస్) అధికారులు అత‌నిని పట్టుకున్నారు.

కాగా నిందితుడు సుమారు 20 సంవత్సరాలుగా భారీ జీతంతో ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నాడు.దాదాపు 43 సంవత్సరాల క్రితం అంటే 1979లో మరణించిన చిన్నారి విలియం పేరును ఉప‌యోగించుకుని ఎందుకు జీవించాడో విచార‌ణ‌లో వెల్ల‌డికావాల్సివుంది.

డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చావా.? పవన్ కు ముద్రగడ ప్రశ్న