సూపర్ ఉమెన్ అంటే ఇలా ఉంటారు కాబోలు.. వీడియో వైరల్

ప్రస్తుత రోజులలో ఎక్కడ చూసినా కూడా దొంగతనాలు జరుగుతున్న సంఘటనలను చూస్తున్నాం.ఈ క్రమంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

ఒక్కోసారి ఒంటరిగా ఉంటున్న మహిళలపై దాడులకి పాల్పడడంతో పాటు.దొంగతనాలు కూడా జరిగిన సందర్భాలు చాలానే చూసాం.

ఎంతోమంది మహిళలు వారి కుటుంబం కోసం ఎన్నో సాహసాలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

అయితే అచ్చం అలాగే తాజాగా ఒక మహిళ ఇంట్లో దొంగతనానికి వ( Robbery )చ్చిన ఒక ముగ్గురు వ్యక్తులను ఎంతో ధైర్యంగా చాకచక్యంగా వ్యవహరించి వారిని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలాగా చేసింది.

"""/" / ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెళ్తే.పంజాబ్( Punjab ) లోని అమృత్‌సర్‌ లోని వెర్కా ప్రాంతంలో జగ్జిత్ సింగ్‌ అనే నగల దుకాణం వారు నివాసం ఉంటున్నారు.

అతడికి భార్య మండూప్ కౌర్, ఇద్దరు పిల్లలు.అయితే ఆ వ్యక్తి ప్రతిరోజు కూడా ఉదయాన్నే బంగారం షాప్ కు వెళ్లి విధులు నిర్వహిస్తూ ఉంటారు.

తాజాగా మంగళవారం నాడు మధ్యాహ్నం సమయంలో మండూప్ కౌర్ తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంటున్న సమయంలో ఒక ముగ్గురు దుండగులు ఆయుధాలతో గోడ దూకి ఇంటి లోపలికి రావడానికి ట్రై చేసారు.

ఇది గమనించిన ఆ మహిళ అప్రమత్తమై అన్ని గదులకు తాళం వేసింది అలాగే పిల్లలను కూడా మరొక గదిలో ఉంచింది.

ఈ క్రమంలో ముగ్గురు దుండగులు కూడా ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తెరిచేందుకు ప్రయత్నం చేయగా లోపల నుంచి తలుపు రాకుండా ఉండడానికి తీవ్రంగా కృషి చేసింది.

అవతల నుంచి ముగ్గురు వ్యక్తులు ఎంత ప్రయత్నం చేసినా.ఆమె వెనుకంజ వేయలేదు.

దాదాపు ఇలా ఒక 20 నిమిషాల పాటు దొంగలను అడ్డుకోవడం, చివరికి ముఖ ద్వారం మూసువేసి పక్కనే ఉన్న సోఫాను అడ్డుగా పెట్టింది.

దీంతో దొంగలు ఇంట్లో లోపలి రాలేకపోయారు.అలాగే వెంటనే ఆ మహిళ అరవడంతో పాటు చుట్టుపక్కల వారికి కాల్స్ చేయడంతో దుండగులు అక్కడ నుంచి పారిపోయారు.

"""/" / ఇక విషయం తెలుసుకున్న భర్త జగ్జిత్ సింగ్‌ ఇంటికి చేరుకొని పోలీసులకు సమాచారం అందజేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసి కెమెరా ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ మహిళ చేసిన ధైర్య సాహసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కొందరు 'సూపర్ వుమెన్( Super Woman )' అంటూ కామెంట్ చేస్తూ ఉంటే.

మరికొందరు ఆ మహిళ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్11, శుక్రవారం 2024