నా దృష్టిలో ఓజీ అంటే అతను మాత్రమే… రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
TeluguStop.com
సినీ నటి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
ఈమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు.
అదే విధంగా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటున్నారు.
ఇలా ఒక వైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
"""/" /
ఇకపోతే రేణు దేశాయ్ ఏ విషయం గురించి అయినా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఈమె కొన్నిసార్లు విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇలా ఎన్నోసార్లు విమర్శలు పాలైన ఈమె ప్రస్తుతం ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రేణు దేశాయ్ భారత చైత్యన్య యువజన పార్టీ నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
సావిత్రి బాయి పూలే 194 వ జయంతిని పురస్కరించుకొని ఈ వేడుకను నిర్వహించారు.
"""/" /
ఇక ఈ కార్యక్రమానికి రేణు దేశాయ్ తో పాటు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ( Bramhanandam ) కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ.తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటాను అనే విషయం అందరికీ తెలిసిందే.
కానీ ఈ జయంతి వేడుకలలో పాల్గొనాలని రామ చంద్ర యాదవ్ గారు ఆహ్వానించడంతో ఆయన ఆహ్వానం మేరకే ఇక్కడికి వచ్చానని తెలిపారు.
బ్రహ్మానందం గారి లాంటి లెజెండ్స్ ఉన్నటువంటి ఈ వేదికని నేను పంచుకోవడాన్ని ఎంతో అదృష్టగా భావిస్తున్నానని తెలిపారు.
నా దృష్టిలో ఆయనే నిజమైన ఓజీ.ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ ప్రశంసించారు.
మహిళల విద్య కోసం సావిత్రి బాయి చేసి కృషి సాధారణమైనది కాదు, అలాంటి మహానుభావురాలి జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే మీ పల్చటి జుట్టు దట్టంగా మారడం పక్కా!