బ్రేకింగ్: వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్‎లో కారు బీభత్సం

వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్‎లో కారు బీభత్సం సృష్టించింది.కొత్త కారు జనాలపైకి దూసుకెళ్లింది.

కొత్తగా కొనుగోలు చేసిన కారును యజమాని దర్గాలో పూజల కోసం తీసుకువచ్చారు.ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పడంతో భక్తులపై దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో నలుగురి తీవ్ర గాయాలు కాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు.వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించగా.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భక్తులు కారు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అచ్చం మనిషిలాగే ఉన్నాడు.. ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో నిద్రపోతున్న విగ్రహం చూస్తే గుండె గుభేల్!