ఏకాంత సేవతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్( Narayanpur ) గ్రామంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు యాగ్నిక స్వామి మంగళాచార్యులు ప్రకటించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దత్తత దేవాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 17 నుండి 20వ తేదీ శనివారంతో బ్రహ్మోత్సవాలు ముగియగా ఉదయం స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది పురవీధుల గుండా పెద్ద రతంలో శ్రీ సీతారామచంద్రస్వామి( Sree SitaRamachandra Swamy ) ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.
భక్తులకు పొన్నాల రాములు అన్నదానం చేశారు వ్రతానికి పూల అలంకరణ కోసం పంతం రామచంద్రం 16 వేల రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది రథోత్సవంలో మహిళలు భజన పాటలతో నృత్యాలు చేశారు ఆలయ కమిటీ చైర్మన్ సూర నర్సయ్య మాట్లాడుతూ రాజరాజేశ్వర దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణం రోజు తలంబ్రాలు వస్త్రాలు రావడం జరిగిందని అదే రోజు లడ్డూను వేలంపాట వేయగా 70 వేల రూపాయలకు తోట దేవరాజు వేలం పాటలో దక్కించుకోవడం జరిగిందన్నారు.
గ్రామ బలి ఏకాంత సేవతో ఐదు రోజులుగా జరిగిన బ్రహ్మోత్సవాలు ముగియడం జరిగిందని అర్చకులు వేణుగోపాల చారి తెలిపారు.
రథోత్సవం( Rathotsavam ) సందర్భంగా మెకానిక్ రాములన్న పులిహోర , ఎల్లారెడ్డిపేట ఆశ్వీణీ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ జి సత్యనారాయణ స్వామి అన్నప్రసాదం, ఏ వన్ సివిల్ కాంట్రాక్టర్ పంతం రామచంద్రం పూలమాలలు రథానికి సరిపడా సమకూర్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు నిమ్మ లక్ష్మి, నారాయణ రెడ్డి , దొమ్మాటి నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ సిరిపురం మహేందర్, ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగి ఎలుసాని ప్రవీణ్ యాదవ్ , ఎంపీటీసీ సభ్యురాలు అపెరా సుల్తానా మజీద్ , మాజీ ఎంపిపి ఎలుసాని మెహాన్ యాదవ్ , నర్సాగౌడ్, పర్షరామ్ రెడ్డి, వేణు రెడ్డి , మోతే మధుసుదన్ రెడ్డి, లింగాల రాజు గౌడ్ ,బొల్గం రాధ కీషన్ గౌడ్ , నాయకులు నిమ్మ మల్లారెడ్డి, మోతే నర్సింహారెడ్డి , లింగాల అంజా గౌడ్ లద్దునూరి హనుమాన్లు, లక్ష్మారెడ్డి , భక్తులు పాల్గొన్నారు.
అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. పుష్ప 2 ను బాయ్ కాట్ చేయాలంటున్న ఫ్యాన్స్?