అఖండ సీక్వెల్ లో మోక్షజ్ఞ ఉన్నాడా లేదా.. ఆ ప్రశ్నలకు అసలు క్లారిటీ ఇదే!
TeluguStop.com
తాజాగా నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) అలాగే బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కాంబినేషన్లో అఖండ2 సినిమా మొదలైన విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాదులో చాలా గ్రాండ్ గా జరిగాయి.
ఈ పూజా కార్యక్రమాలకు బాలయ్య బాబు అలాగే హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో పాటుగా భలే బాబు కూతుర్లు కుటుంబ సభ్యులు మూవీ మేకర్స్ పాల్గొన్నారు.
ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
"""/" /
అఖండ తాండవం మూవీ ఓపెనింగ్ లో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలవాల్సింది బాలయ్య.
కానీ అక్కడ అందరికన్నా ఎక్కువ హైలెట్ అయ్యింది ఆయన కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజశ్వినిలు( Nara Brahmani , Tejashwini ).
తేజశ్వని సమర్పకురాలిగా, బ్రాహ్మణి తండ్రి సినిమాకి క్లాప్ కొట్టారు.బాలయ్య కుమార్తెలు ఎంత పద్దతిగా సంప్రదాయంగా ఉంటారో అందరికి తెలుసు.
ఇప్పుడు తండ్రి మూవీ ఓపెనింగ్ లో కుమార్తెలిద్దరూ ఎంతగా హైలెట్ అయ్యారో సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే అఖండ 2 మూవీ( Akhanda 2 Movie ) ఓపెనింగ్ వీడియోస్ చూస్తే అర్ధమైపోతుంది.
"""/" /
తేజస్విని, బ్రాహ్మణి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న వీడియోస్, ఫొటోస్, బాలయ్యతో కుమార్తెల ఇద్దరి ఫొటోస్ చూస్తే అభిమానులకి ఒక కోరిక పుట్టింది.
అదేమిటంటే అదే అక్కడ బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా ఉంటే ఎంత బావుంటుందో అని.
అసలే ఈ ఏడాదే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఖరారైంది.మోక్షజ్ఞ న్యూ మేకోవర్ చూసి నందమూరి అభిమానులు మైమరచిపోయారు.
అలాంటి సమయంలో బాలయ్య మూవీ ఓపెనింగ్ లో అక్కలతో పాటుగా మోక్షజ్ఞ కూడా ఉంటే అది అభిమానుల ఆనందానికి అవధులు ఉండేవి కావని చెప్పాలి.
ఆ హీరోయిన్ ను చూశాక నా ఆలోచన మార్చుకున్నా.. మంచు లక్ష్మీ క్రేజీ కామెంట్స్ వైరల్!