ఘనంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి నిశ్చితార్థం… ఫోటోలు వైరల్!
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్యబ్రహ్మగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మానందం (Brahmanandam) ఎన్నో వందల సినిమాలలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు.
ఇలా బ్రహ్మానందం అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షక అభిమానులను కూడా సంపాదించుకున్నారు.
వందల సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్న బ్రహ్మానందం ప్రస్తుతం వయసు పైబడటంతో పూర్తిస్థాయిలో సినిమాలను తగ్గించారని చెప్పాలి.
కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో ఈయన నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. """/" /
ఇకపోతే బ్రహ్మానందం సినీ కెరియర్ గురించి పక్కనపెట్టి ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయనకు ఇద్దరు కుమారులన్న విషయం మనకు తెలిసిందే.
మొదటి కుమారుడు గౌతమ్ (Gautham) ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.పలు సినిమాలలో నటించిన గౌతమ్ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇతర వ్యాపారాలలో స్థిరపడ్డారు.
"""/" / ఇక ఈయనకు ఇంకో కుమారుడు కూడా ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు.
ఈయన చిన్న కుమారుడు పేరు సిద్దార్థ్(Siddarth) ఈయన విదేశాలలో స్థిరపడ్డారు.తాజాగా ఈయన నిశ్చితార్థం ఆదివారం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
"""/" /
డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో (Aishwarya) సిద్దార్థ్ నిశ్చితార్ధం జరిగింది.
సిద్దార్ధ్‌కు కాబోయే భార్య ఐశ్వర్య కూడా డాక్టరే.ఇక వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తుంది.
ప్రస్తుతం వీరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించబోతున్నారు.
ఈ నిశ్చితార్థ వేడుకకు ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్, బ్రహ్మానందం అభిమానులు కూడా కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.