Brahmanandam : బ్రహ్మానందం కి ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు..! 

లేటు వయసులో ఒక అద్భుతమైన పాత్రలో నటించిన బ్రహ్మానందం( Brahmananda ) నటనను మెచ్చుకుంటూ ఎంతో మంది వందల ఆర్టికల్స్ రాస్తున్నారు.

ఇన్నేళ్ల సినిమా అనుభవంలో బ్రహ్మానందం చేయదగ్గ ఇటువంటి పాత్ర ఇప్పటివరకు ఎందుకు చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

కృష్ణవంశీ తన మూడు పాత్రల సినిమా కోసం ప్రతి పాత్రకు ముఖ్యమైన నటుడు ఉండాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం అనే ముగ్గురు ఉత్తమ నటులను ఎంచుకున్నాడు.

ఇందులో ఎవరిది కాస్త డల్ అయినా కూడా సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యేది.

మొదట నటి రమ్యకృష్ణ పాత్ర కోసం ఎంతో మందిని ఆడిషన్ చేయగా కృష్ణవంశీ ఎవరిని ఎంచుకోలేకపోయారు.

"""/" / ఇక రమ్యకృష్ణ( Ramya Krishna ) తనకు తానుగా ఆ పాత్ర చేసి ఆ సినిమా యొక్క గొప్పతనాన్ని పెంచాలని భావించింది ఆమె అనుకున్నట్టుగానే తన పాత్ర చక్కగా పండింది.

ఇక బ్రహ్మానందం పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇంత లేటు వయసులో ఈ పాత్ర చేయకూడదు అని బ్రహ్మానందం అనుకున్న లేదా ఇలాంటి ఒక పాత్ర కోసం అతని తీసుకోకూడదని కృష్ణవంశీ( Krishna Family ) అనుకున్న ఈ అద్భుతం జరిగి ఉండేది కాదు.

ఇక కమెడియన్స్ గా వెలుగు వెలిగిన చాలామంది నటులు లేటు వయసులో భారమైన పాత్రలు పోషించి జాతీయ, రాష్ట్ర అవార్డులు అందుకున్నారు.

కమెడియన్ నగేష్, ఉమా శ్రీ, సలీం కుమార్, కోవై సరళ వంటి వారు సైతం బరువున్న పాత్రలను చేసినవారే.

"""/" / అదృష్టం కొద్ది కోవై సరళ నటించిన సెంబి సినిమాను పక్కన పెడితే మిగతా నటులందరూ కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు తమ తమ పాత్రలకు న్యాయం చేసి రివార్డులు దక్కించుకున్నారు.

ఇప్పుడు బ్రహ్మానందం నటించిన రంగమార్తాండ( Rangamarthanda ) చిత్రానికి గాను అతనికి ఎలాంటి అవార్డు లభించే ఆస్కారం లేదు.

ఎందుకంటే అదొక మరాఠీ సినిమాకి రీమేక్ చిత్రంగా వచ్చింది కాబట్టి జాతీయ అవార్డులు ఇవ్వడానికి అర్హత ఉండదు.

అందుకే బ్రహ్మానందం ఇంత బాగా నటించినాప్పటికీ కూడా ఎలాంటి అవార్డులు అందుకోలేడు.గా ప్రేక్షకులం మెప్పు పొందడమే ఎంతో పెద్ద అవార్డుగా భావించే నటీనటులు ఉన్న మన తెలుగు ఇండస్ట్రీకి జాతీయ అవార్డు వచ్చిన రాకపోయినా ఈ సినిమా మాత్రం బ్రహ్మానందం కోసం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటారు.

కాంగ్రెస్ నీచ రాజకీయం ఎన్నికల్లో లాభం కోసమేనా?: కేటీఆర్