మరోసారి తాత అయిన బ్రహ్మానందం.. మహాలక్ష్మి పుట్టిందంటూ సంతోషం!

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వందల సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్న సీనియర్ నటుడు బ్రహ్మానందం గురించి పరిచయం అవసరం లేదు.

ఒకానొక సమయంలో బ్రహ్మానందం లేని సినిమా అంటూ ఉండేది కాదు ఇలా ప్రతి ఒక్క హీరోల సినిమాలలో తన కామెడీ డైలాగులతో అందరిని నవ్వించే సందడి చేసిన బ్రహ్మానందం ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

ప్రస్తుతం ఈయన కేవలం సెలెక్టివ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ సందడి చేస్తున్నారు.తాజాగా బ్రహ్మానందం నటించిన పంచతంత్రం సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదలకు సిద్ధమయింది.

ఇకపోతే బ్రహ్మానందం ఇదివరకే తాతగా మారిన విషయం మనకు తెలిసిందే.ఈయన కుమారుడు గౌతమ్ దంపతులకు కుమారుడు జన్మించడంతో బ్రహ్మానందం తన మనవడితో కలిసి ఆడుకుంటున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు.

ఈ క్రమంలోనే బ్రహ్మానందం మరోసారి తాతయ్య అయ్యారని తెలుస్తోంది.గౌతమ్ జ్యోత్స్న దంపతులు మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు గౌతమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

"""/"/ ఈ క్రమంలోనే అప్పుడే పుట్టిన తన కూతురితో తన కుమారుడు పార్థ ఆడుకుంటూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ.

అమ్మాయి పుట్టడంతో ఆనందం రెట్టింపు అయింది అంటూ గౌతమ్ తన ఇంటికి మహాలక్ష్మి అడుగు పెట్టిందంటూ కూతురు పుట్టిన విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది సెలబ్రిటీలు చిన్నారిని దీవిస్తూ గౌతమ్ దంపతులతో పాటు బ్రహ్మానందం గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లండన్‌లో కంగనా పాటకు స్టెప్పులేసిన ఫారనర్స్‌.. వీడియో వైరల్..