జబర్దస్త్ కమెడియన్ కి ఇల్లు కొనిచ్చిన బ్రహ్మానందం..ఎవరికీ తెలియకుండా ఇన్ని సహాయాలు చేశాడా..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాస్యానికి సరికొత్త నిర్వచనం తెలిపిన మహానటుడు పద్మశ్రీ బ్రహ్మానందం గారు.

వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన బ్రహ్మానందం( Brahmanandam ) లాంటి కమెడియన్ ఇండియా లోనే లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఒకప్పుడు ఆయనకీ ఏ రేంజ్ క్రేజ్ ఉండేది అంటే,ప్రేక్షకులు సినిమాలో హీరో ఎవరు అనేది చూసేవాళ్ళు కాదు, బ్రహ్మానందం ఉన్నాడా లేదా అనేది మాత్రమే చూసేవాళ్ళు.

కేవలం ఆయన కోసమే థియేటర్స్ కి క్యూ కట్టే ఆడియన్స్ సంఖ్య కోట్లలో ఉంటుంది.

మెగాస్టార్ చిరంజీవి చొరవతో, జంధ్యాల గారి సినిమాల్లో అవకాశం సంపాదించి, అంచలంచలుగా ఎదుగుతూ హాస్య బ్రహ్మ గా నిలిచాడు బ్రహ్మానందం.

ఒకప్పుడు ఏడాదికి కనీసం 20 సినిమాల్లో కనిపించే బ్రహ్మానందం, ఈమధ్య అప్పుడప్పుడు మాత్రమే వెండితెర మీద కనిపిస్తున్నాడు, అందుకు కారణం ఆయన వయస్సు.

ఇక సంపాదించింది చాలు ఆరోగ్యానికి తగ్గట్టుగా నడుచుకుందాం అనే ఉద్దేశ్యం తోనే ఆయన సినిమాలు తక్కువగా చేస్తున్నాడు.

"""/" / నటుడిగా బ్రహ్మానందం కి వంకలు పెట్టడానికి ఏమి లేదు, ఆయన లాంటి నటుడు మనకి దొరకడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం.

కానీ బ్రహ్మానందం వ్యక్తిగతం పై సోషల్ మీడియా లో అనేక రూమర్స్ ఇన్ని రోజులు ప్రచారం అవుతూ వచ్చాయి.

బ్రహ్మానందం ఎవరికీ రూపాయి సహాయం చెయ్యడని, ఆయన ఒక పిసినారి అని,ఇలా బ్రహ్మానందం పై అనేక ఆరోపణలు వచ్చాయి.

కానీ నిజానికి బ్రహ్మానందం స్వభావం అలాంటిది కాదు, ఆయన ఇది వరకు ఎంతో మందికి సహాయం చేసి ఉన్నారు, కానీ ఎన్నడూ కూడా మీడియా ముందు వాటి గురించి చెప్పుకోలేదు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం లో కూడా బ్రహ్మానందం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాడు, కానీ ఈనాడు ఆయన బయటకి రానివ్వలేదు.

ఇక తన తోటి కళాకారులకు , కమెడియన్స్ కి ఎప్పుడు అవసరం వచ్చినా ఆయన ముఖం చాటెయ్యలేదు, తన అభయ హస్తం అందిస్తూనే ఉన్నాడు, రీసెంట్ గా బ్రహ్మానందం చేసిన ఒక సహాయం గురించి సోషల్ మీడియా( Social Media ) లో బయట పడింది.

"""/" / ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి( Racha Ravi ) రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో బ్రహానందం తో తనకి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.

బ్రహ్మానందం గారు నన్ను సొంత తమ్ముడిలాగా చూసుకునేవాడని, కెరీర్ ప్రారంభం లో ఆయన నన్ను ఇల్లు కట్టుకోరా అని చాలా బలవంతం పెట్టేవాడిని, కావాలంటే నేను ఒక 5 లక్షల రూపాయిలు ఇస్తాను, ఇల్లు ప్రారంభించు అని ఆయన చేతిలో అప్పట్లో 5 లక్షల రూపాయిలు ఇచ్చాడట బ్రహ్మానందం.

అలా ఆయన ఎంతో మంది కమెడియన్స్ కి సహాయం చేసాడని, కేవలం ఆర్ధిక సహాయం మాత్రమే కాదు, టాలెంట్ ఉందని ఆయనకీ అనిపిస్తే తనకి తెలిసిన డైరెక్టర్స్ తో సినిమా అవకాశాలు కూడా ఇప్పించేవాడని , ఇలా ఆయన గురించి తెలియనివి ఎన్నో ఉన్నాయి అంటూ రచ్చ రవి చెప్పుకొచ్చాడు.

ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం, మృతుల్లో అన్నదమ్ములు