వాళ్ల ఓవరాక్షన్ ముందు మా యాక్షన్ చాలట్లేదు.. బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు కమెడియన్ బ్రహ్మాజీ ( Comedian Brahmaji )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా అలాగే కమెడియన్గా అనగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
అలాగే అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారం అయ్యే పలు షోలకు జెడ్జ్ కూడా వ్యవహరిస్తూ ఉంటారు.
సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు బ్రహ్మాజీ.
"""/" /
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో( Social Medi ) అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగే చాలా అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
వాటిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటారు.
అందులో భాగంగానే తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బ్రహ్మాజీ బౌన్సర్లను ఉద్దేశించి తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.వాళ్ల ఓవర్ యాక్షన్ ఎక్కువైందనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ లో ఈ విధంగా రాసుకు వచ్చారు. """/" /
ఎక్కడ చూసినా బౌన్సర్లు.
బౌన్సర్లు.వాళ్ల ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవడం లేదు.
ఏం చేయాలి.అవుట్ డోర్స్ అయితే ఫర్వాలేదు.
సెట్స్ లో కూడానా.? అని రాసుకొచ్చారు.
తాజాగా పరిణామాల రీత్యా ఆయన బౌన్సర్లను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఎవరి బౌన్సర్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది మాత్రం ఆయన చెప్పలేదు.దీంతో కొంతమంది ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఇంకెవరో కాదు అల్లు అర్జున్ బౌన్సర్లను ఉద్దేశించి ఆయన ఈ విధంగా పోస్ట్ చేశారో అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివాదంలో చిక్కుకున్న సింగర్ మధుప్రియ…. అరెస్టు చేయాలి అంటూ డిమాండ్?