ఈఫిల్ టవర్ ముందు గర్ల్‌ఫ్రెండ్‌కి బాయ్‌ఫ్రెండ్ మ్యారేజ్ ప్రపోజల్.. వీడియో వైరల్!

లవ్ ప్రపోజ్ లేదా మ్యారేజ్ ప్రపోజ్ చేసేటప్పుడు అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా డ్రామా చేస్తారని అనడంలో సందేహం లేదు.

కొందరు అందరి ముందు మోకాళ్లపై నిల్చొని ప్రపోజ్ చేస్తే.మరికొందరు ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళ్లి సర్‌ప్రైజింగ్‌గా ప్రపోజ్ చేస్తారు.

అయితే తాజాగా ఒక వ్యక్తి తన మ్యారేజ్ ప్రపోజల్ చేసేందుకు పారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు ప్రదేశాన్ని ఎంచుకున్నాడు.

ఇటీవల, ఈ వ్యక్తి తన ప్రియురాలికి సినిమాల్లో హీరో లాగా పెళ్లి చేసుకోవాలని అడిగాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో ఈ యువకుడు షారుఖ్ పాటకు డ్యాన్స్ చేస్తూ పారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు ప్రపోజ్ చేశాడు.

కుచ్ కుచ్ హోతా హై (1998) మూవీలో కోయి మిల్ గయాకు పాటకు ఇతడు డ్యాన్స్ చేశాడు.

అతడు అలా చేయడం చూసి గర్ల్‌ఫ్రెండ్ చాలా ఆశ్చర్య పోయింది.అలాగే అతనితో కలిసి సంతోషంగా డ్యాన్స్ చేసింది.

ఈ యువకుడు తన వెనక గులాబీ రేకులు, కొవ్వొత్తులతో "నన్ను పెళ్లి చేసుకో" అని రాసాడు.

ఆ వ్యక్తి వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.ట్విట్టర్‌లో సచిన్ టాండన్ ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేశాడు షేర్ చేసిన సమయం నుంచి దీనికి 29 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.

దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఆ యువతి ఖచ్చితంగా తన మ్యారేజ్ ప్రపోజల్‌ను ఓకే చేసి ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

అయితే కొందరు మాత్రం.'ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వారి ప్రైవసీకి భంగం కలిగించడం ఏం బాగోలేదు' అని అంటున్నారు.

ఈ క్యూట్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

పుష్ప 2 సినిమా పేరు చెబితే చాలు బాలీవుడ్ భయపడుతుందా..?