నార్త్ లో మళ్ళీ బాయ్ కాట్ ట్రెండ్.. ఆదిపురుష్ కు కూడా సెగ తగలనుందా?

బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది.లేటెస్ట్ సినిమాలపై పలువురు విమర్శలు చేస్తూ ఆ సినిమాలను బాయ్ కాట్ చేయాలంటూ నెట్టింట ప్రచారం చేస్తూ ఉంటారు.

ఆయా సినిమాల టైటిల్ లను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ రచ్చ రచ్చ చేయడం నార్త్ ప్రేక్షకులలో కొంత మందికి అలవాటే.

అయితే తాజాగా ఆదిపురుష్ సినిమాకు కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది.ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఆదిపురుష్'' ( Adipurush ) ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

మరి ఈ ట్రైలర్ కు అందరి నుండిభారీ రెస్పాన్స్ అయితే వస్తుంది.ఇంతకు ముందు కంటే విజువల్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ మరింత గ్రాండ్ గా ఉండడంతో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టు కుంటుంది.

"""/" / మరి ఎంత నచ్చిన కొంత మంది విమర్శలు చేసే వారు కూడా ఉండడం సహజమే.

అలాగే ఆదిపురుష్ ట్రైలర్ విషయంలో కూడా జరుగుతుంది.ఈ ట్రైలర్ కు అన్ని బాషల నుండి మంచి రెస్పాన్స్ రాగ నార్త్ లో మాత్రం కొంతమంది బాయ్ కాట్ ఆదిపురుష్ అనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.

ఇందులో రామాయణానికి ఏ మాత్రం దగ్గరగా లేకుండా తెరకెక్కించారని. """/" / అలాగే ట్రైలర్ లో హనుమంతుడి పాత్రపై కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

అయితే ఈ విమర్శలపై చాలా మంది పట్టించుకునే అవసరం లేదని.ఇది వరకు చాలా సినిమాలకు బాయ్ కాట్ ( Boycott Adipurush ) సెగ తగిలింది అని అంతగా ఇది సినిమాను ప్రభావితం చేసే అవకాశం లేదని అంటున్నారు.

ఎక్కువ మంది నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఈ బాయ్ కాట్ ట్రెండ్ ను పట్టించుకునే పనే లేదు.

మరి రిలీజ్ కు ఇంకా నెల రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచే అవకాశం కనిపిస్తుంది.

పాన్ కార్డు నెంబర్లో ఇంత మ్యాటర్ ఉందని తెలుసా.?