అఖండ2 సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన బోయపాటి.. సినిమాలో అదే చూపిస్తానంటూ?

టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Srinu ) గురించి మనందరికీ తెలిసిందే.

బోయపాటి గత ఏడాది రామ్ పోతినేనితో కలిసి స్కంద సినిమాతో ప్రేక్షకులను పలకరించగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

దాంతో తన తదుపరి చిత్రంపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు బోయపాటి.అయితే రీసెంట్‌గా జరిగిన ఈవెంట్‌లో తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి బోయపాటి మాట్లాడారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తానని బోయపాటి చెప్పారు. """/" / అలానే అఖండ 2( Akhanda 2 )పై కూడా స్పందించారు.

అఖండ సీక్వెల్‌లో ఏం చూపించబోతున్నారంటూ అడిగిన ప్రశ్నకి ఈ సీక్వెల్‌లో సమాజానికి ఏం అవసరమో అదే చూపిస్తాను అంటూ బోయపాటి బదులిచ్చారు.

దీన్ని బట్టి చూస్తే బోయపాటి మూవీ కోసం మరికొన్ని నెలలు ఆగాల్సిందేనన్న మాట.

మరి ఎన్నికలు అయిన తర్వాత అఖండ 2ను అనౌన్స్ చేస్తారా లేక మరేదైనా సినిమానా అనేది చూడాలి మారి.

బోయపాటి కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది అఖండ సినిమా. """/" / ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు.

ముఖ్యంగా అఘోరా పాత్ర సినిమాకే హైలెట్ అయింది.ఈ సినిమాకి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

ఇందులో ప్రగ్యా జైస్వాల్( Pragya Jaiswal ) హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.

అఖండ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

వెంకీ అట్లూరి ఇక తెలుగు హీరోలతో సినిమాలు చేయాడా..?