'అఖండ' ఎఫెక్ట్‌.. ఒకే సారి రెండు ఆఫర్లు వచ్చాయట

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా ను చేస్తున్నాడు.ఆ సినిమా కు యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అఖండ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలు పెంచుతూ సినిమా నుండి ఒక వీడియోను విడుదల చేశారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంను నందమూరి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్ల కోసం ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఈ సినిమా తో బోయపాటి మంచి గుర్తిండి పోయే సక్సెస్‌ ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే బోయపాటి ఈ సినిమా ను పూర్తి చేసేందుకు సిద్దం అయ్యాడు.రెండు వారాల్లో షూటింగ్‌ ముగుస్తుంది.

ఇదే సమయంలో తదుపరి సినిమా ను కూడా బోయపాటి ఖరారు చేశాడనే వార్తలు వస్తున్నాయి.

బోయపాటి గత చిత్రం వినయ విధేయ రామ సినిమా అట్టర్‌ ప్లాప్‌ అయిన విషయం తెల్సిందే.

దాంతో ఎవరు కూడా ఆయనతో వర్క్‌ చేసేందుకు ముందుకు రాలేదు.బాలయ్య నమ్మకంతో ఈ సినిమా ను చేశాడు.

ఇప్పుడు ఈ సినిమా కు వచ్చిన బజ్‌ నేపథ్యంలో అల్లు అర్జున్‌ మరియు రవితేజ లతో సినిమా లు చేసేందుకు ఈయనకు ఆఫర్‌ వచ్చింది.

మొదట ఎవరితో సినిమా చేస్తాడు అనేది చూడాలి.అల్లు అర్జున్ పుష్ప రెండు పార్ట్‌ లు ఉన్న కారణంగా సినిమా ను కాస్త ఆలస్యం చేసే అవకాశం ఉంది.

అందుకే అంతకు ముందే రవితేజతో సినిమా ను బోయపాటి చేస్తాడనే టాక్ వస్తుంది.

ప్రస్తుతం ఈ రెండు సినిమా లకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం అఖండ సినిమా ను చివరి దశ వర్క్‌ కు సిద్దం చేస్తున్న బోయపాటి సినిమాను దసరాకు విడుదల చేయాలని భావిస్తున్నాడు.

కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చి ఉండకుంటే ఈ వారంలోనే సినిమా వచ్చి ఉండేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఆ సీన్లను డైరెక్టర్ సుకుమార్ కాపీ చేసి సినిమాలో పెట్టారా.. అసలేం జరిగిందంటే?