బాలయ్య తో సినిమా గురించి బోయపాటి ఏమన్నాడంటే..!

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) కెరీర్‌ డల్ గా ఉన్న ప్రతి సారి కూడా దర్శకుడు బోయపాటి( Boyapati Srinu ) అద్భుతమైన సినిమాలను అందించిన విషయం తెల్సిందే.

వీరిద్దరి కాంబోలో ఇప్పటికే సింహా, లెజెండ్ మరియు అఖండ సినిమా లు వచ్చిన విషయం తెల్సిందే.

వీరి కాంబోలో నాల్గవ సినిమా రాబోతుంది అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

మొన్నటి వరకు బాలయ్య తో బోయపాటి మూవీ 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఉంటుందని, అది ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ అనే ప్రచారం జరిగింది.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరి కాంబోలో మూవీ ఉంది కానీ అది వచ్చే ఏడాది ఎన్నికల ముందు ఉండే అవకాశం లేదని.

ఆ సినిమా కచ్చితంగా వచ్చే ఏడాది చివర్లో ప్రారంభం అయి 2025 లో వస్తుందని ప్రచారం జరిగింది.

"""/" / మీడియా లో జరిగిన భారీ ప్రచారం పై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించాడు.

తాజాగా ఆయన రామ్ తో( Ram Pothineni ) రూపొందించిన స్కంద సినిమా( Skanda Movie ) పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధం అయింది.

అతి త్వరలోనే విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమా ల్లో బోయపాటి మాట్లాడుతూ తన తదుపరి సినిమా బాలకృష్ణ తో ఉంటుంది అనే విషయాన్ని కన్ఫర్మ్‌ చేయలేదు.

కానీ తప్పకుండా బాలయ్య బాబు తో తన సినిమా ఉంటుంది.ఆ సినిమా తప్పకుండా గత మూడు సినిమాల మాదిరిగా భారీ విజయాలను సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

కానీ బాలయ్య తో వెంటనే సినిమా చేయాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. """/" / బాలయ్య ఇప్పటికే భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాను చేస్తూ ఉండగా బాబీ దర్శకత్వం లో సినిమా కు కమిట్‌ అయ్యాడు.

ఈ రెండు సినిమా లు పూర్తి అయ్యే లోగా ఎన్నికలు వస్తాయి.ఎన్నికల హడావిడి మొదలు అయితే రెండు మూడు నెలల పాటు సినిమాల షూటింగ్ లకు బాలయ్య దూరం ఉండే అవకాశం ఉంది.

ఒక వేళ టీడీపీ గెలిస్తే బాలయ్య మూడవ సారి ఎమ్మెల్యే అయితే కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశాలు లేకపోలేదు.

కనుక సినిమాల విషయం బాలయ్య ఆలోచిస్తాడో లేదో.బోయపాటి సినిమా ఉంటుందో లేదో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పార్లమెంట్‌లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిథ్యం ఉండాలి .. స్టాండింగ్ కమిటీ సిఫారసు