స్కంద రిలీజ్ విషయంలో బోయపాటి రీగ్రేట్ ఫీల్ అవుతున్నారా?

ప్రముఖ మాస్ అండ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Sreenu ) ప్రస్తుతం రామ్ పోతినేని( Ram Pothineni ) శ్రీ లీల ( Sree Leela ) హీరో హీరోయిన్లుగా నటించిన స్కంద( Skanda ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది.

దీంతో ఈ సినిమాని సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా వేశారు.సెప్టెంబర్ 28వ తేదీ ఈ సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

"""/" / ఇక ఈ సినిమా విషయంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను కాస్త రిగ్రేట్ ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.

బోయపాటి శీను ఈ సినిమా విడుదలను సెప్టెంబర్ 15వ తేదీ వాయిదా వేసుకుని సెప్టెంబర్ 28వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించడం పట్ల కాస్త రిగ్రేట్ ఫీల్ అవుతున్నారని సమాచారం.

వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా కనుక విడుదల చేసి ఉంటే 28వ తేదీ వరకు ఏ విధమైనటువంటి సినిమాలు విడుదల లేకపోవడం వల్ల ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ మంచి ఆదరణ లభించి ఉండేదని కొందరు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

"""/" / ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా పడటంతో అదే సమయంలోనే చంద్రముఖి 2 ( Chandramukhi 2 ), పెద్ద కాపు( Pedda Kapu ) సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి దీంతో ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుందా అన్న సందేహం అందరిలోనూ నెలకొంది ఇక చంద్రముఖి సీక్వెల్ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ ఏర్పడింది.

పెద్ద కాపు సినిమా కూడా మాస్ యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమాలకు కూడా మంచి థియేటర్లను కేటాయిస్తుండడంతో స్కంద విషయంలో బోయపాటి తప్పు చేశానన్న భావనలో ఉన్నారన్న విషయం అర్థమవుతుంది.

కానీ కొంతమంది కంటెంట్ లో సత్తా ఉంటే ఎన్నో సినిమాలు వచ్చిన సినిమా విజయాన్ని ఆపలేవని ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.

 .

నాన్నా మీరో ఫైటర్.. ఎన్నో త్యాగాలు చేశారు.. నారా రోహిత్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!