రామ్ ఆశలన్నీ బోయపాటి మీదనే పెట్టుకున్నాడా?

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను.బోయపాటి అంటేనే యాక్షన్ ఎంటర్టైనర్ అని ప్రేక్షకులు ఒక అవగాహనకు వచ్చేసారు.

అంతలా ఈయన తన సినిమాల్లో యాక్షన్ ను రుచి చూపిస్తూ ఉంటాడు.ఈయన సినిమాలు తీసే విధానం, అందులో చూపించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

ఇటీవలే బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా చేసిన విషయం తెలిసిందే.అఖండ సినిమాతో ఘన విజయం అందుకుని మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో సినిమా ప్రకటించాడు.

రామ్ అయితే తన ఆశలన్నీ బోయపాటి మీదనే పెట్టుకున్నాడు.ఎందుకంటే ఇటీవలే రామ్ లింగుస్వామి దర్శకత్వంలో చేసిన 'ది వారియర్' సినిమా విజయం సాధించలేదు.

మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కూడా భారీ హిట్ అయితే నమోదు చేయలేదు.పైగా ఈ సినిమాతో రామ్ తమిళ్ ఎంట్రీ ఇచ్చాడు.

వారియర్ తో అక్కడ కూడా పాగా వేయాలని చూసినా ఆయన అనుకున్నది జరగక పోవడంతో నిరాశలో ఉన్నాడు.

"""/"/ కనీసం ఇప్పుడు బోయపాటి అయినా భారీ విజయం ఇచ్చి పాన్ ఇండియా స్టార్ అని అనిపిస్తాడు అని ఎదురు చూస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది.

రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నారు.మరి ఈ సినిమాతో బోయపాటి రామ్ కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తాడో చూడాలి.

GATE First Ranker Sai Kiran : యూట్యూబ్ వీడియోల ప్రిపరేషన్ తో గేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సాయికిరణ్.. ఇతని సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!