దిశ బిల్లు పాసైన రోజే... గుంటూరులో ఘోరం

రాష్ట్రంలో అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త చట్టాలను తెస్తోంది కానీ అత్యాచారాలకు అడ్డు కట్ట మాత్రం వేయలేక పోతోంది.

తాజాగా రాష్ట్రంలో బాలికలపై జరుగుతున్నఅత్యాచారాలకుఅడ్డుకట్ట వేసేందుకు దిశ యాక్ట్ చట్టం అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వమయితే చట్టాలు తెస్తోంది కానీ అత్యాచారాలు మాత్రం ఆగడంలేదు.తాజాగా ఒక ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది.

  """/"/ వివరాల్లోకి వెళితే పట్టణంలోని స్థానిక రామిరెడ్డి నగర్లో ఒక పాప తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది.

వీరు నివసిస్తున్న గృహంలోనే పై పోర్షన్ లో లక్ష్మణ్ రెడ్డి అనే యువకుడు కూడా నివసిస్తున్నాడు.

అయితే పనుల నిమిత్తమై పాప తల్లిదండ్రులు బయటికి వెళ్లగా పాప ఒంటరిగా ఇంట్లో ఆడుకుంటోంది.

విషయాన్ని తెలుసుకున్న లక్ష్మణ్ రెడ్డి పాపపై బలవంతంగా అత్యాచారం చేశాడు.ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

అనంతరం పాప తీవ్ర రక్త స్రావానికి గురయ్యింది.ఇది గమనించిన పాప తల్లిదండ్రులు ఏమయ్యిందని విచారించగా తనపై అత్యాచారం జరిగినట్లు పాప వెల్లడించింది.

  దీంతో పాప తండ్రి వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసాడు.

దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.అంతేగాక నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసారు.

అయితే ఇక్కడ ఆశ్చర్య పడాల్సిన విష్యం ఏంటంటే అత్యాచారం చేస్తే ఉరి తీస్తాం అని కొత్త చట్టం తెచ్చిన రోజునే అత్యాచారం జరగడంతో ఒక్కసారిగా గుంటూరులో కలకలం రేపింది.

 .

పొట్ట కొవ్వును ఐసు ముక్కలా కరిగించే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!