దేవర మూవీ క్లోజింగ్ కలెక్షన్ల లెక్క ఇదే.. ఎన్టీఆర్ స్టామినాకు అసలు ప్రూఫ్స్ ఇవే!

కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన దేవర మూవీ( Devara ) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది.

కానీ, కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ రికార్డ్ లు క్రియేట్ చేసింది.

రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ని దాటేసింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో దసరా హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మాస్ రచ్చ చేసి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

"""/" / వర్కింగ్ డేస్ తో పోల్చితే ఆల్ మోస్ట్ డబుల్ మాస్ కలెక్షన్స్ ని అందుకుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ లో( OTT ) స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ని( Devara Closing Collections ) ఒకసారి పరిశీలిస్తే.

ఈ సినిమా 400 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది.

కొరటాల శివకు ఇది అతి పెద్ద రికార్డ్ అని చెప్పాలి.అలాగే తెలుగు వెర్షన్ తో హిందీ వెర్షన్ బాగా వర్కవుట్ అవటం కలిసొచ్చింది తమిళనాడు, కేరళలలో మాత్రం లాస్ వెంచర్ గా మిగిలింది.

అక్కడ అతి తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.అయితే తెలుగు, హిందీ భారీగా వర్కవుట్ కావటంతో సినిమాకు గ్రాస్ ఒక రేంజిలో వచ్చేసింది.

నార్త్ అమెరికా మార్కెట్ నుంచి దేవర 50 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది అని చెప్పాలి.

"""/" / తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 112 కోట్ల రూపాయలకు జరగగా, నిర్మాతకు 22 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ప్రీమియర్స్ లోనే 22 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 60 కోట్ల రూపాయిల గ్రాస్, 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక కర్ణాటక 16 కోట్ల రూపాయిలు, తమిళనాడు లో 3 కోట్ల రూపాయిలు, కేరళలో కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక హిందీ వెర్షన్ లో ఈ చిత్రానికి 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

ఓవరాల్ గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 197 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు 396 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు టాక్.

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వదిలి.. కుంభమేళా బాట పట్టిన మేధావి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!