కేకేఆర్ ను కట్టడి చేసిన బౌలర్లు ..చెన్నై టార్గెట్ 168 !
TeluguStop.com
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో కోల్ కత్తా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు ఆలౌట్ అయింది.
చెన్నైకి 168 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.కోల్ కత్తా ఓపెనర్ గిల్ 11 పరుగులతో నిరాశపరిచినప్పటికీ మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి నిలకడగా ఆడి జట్టుకి గౌరవప్రదమైన స్క్రోర్ అందించారు.
51 బంతుల్లో 3 సిక్స్‌లు, 8 ఫోర్లతో 81 పరుగులు చేశాడు.రాహుల్ తర్వాత కోల్‌కత్తా ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు సాధించింది బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ ఒక్కడు మాత్రమే.
కమిన్స్ 9 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.మిగిలిన అందరూ కూడా చెన్నై బౌలర్ల దాటికి నిలబడలేకపోయారు.
చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం, ఫీల్డర్లు సమర్థంగా వ్యవహరించడంతో కోల్‌కత్తా ఓ మాదిరి స్క్రోర్ కే చాపచుట్టేసింది.
నితీష్ రాణా(9), సునీల్ నరైన్(17), కమ్మిన్స్(17), దినేష్ కార్తీక్(12), మోర్గాన్(7), రస్సెల్ 2 పరుగులు చేశాడు.
నగర్‌కోటి, శివమ్ మావి డకౌట్‌గా వెనుదిరిగాడు.వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగు చేసి రనౌట్ గా పెవిలియన్ కి చేరాడు.
ఇక చెన్నై లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించింది.
షాకింగ్: బంగారు నాలుకలున్న 13 మమ్మీలు.. ఎందుకో తెలిస్తే మతి పోవాల్సిందే..