హార్థిక్ పాండ్యా రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా..ఆ జాబితాలో మూడవ స్థానం..!

భారత్-ఐర్లాండ్( India Vs Ireland ) మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఆడాల్సిన మ్యాచ్ ఒకటి మిగిలి ఉండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్ లో ఆధిత్యత సాధించింది.

అయితే ఐర్లాండ్ సిరీస్ తో క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా( Jasprit Bumrah ) ఈ సిరీస్ లో ఆడిన రెండు టీ20 మ్యాచ్ లోను రెండేసి వికెట్లు తీసి హార్థిక్ పాండ్యా( Hardik Pandya ) పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ చేసేసాడు.

దీంతో భారత్ కు చెందిన ఆ జాబితాలో మూడవ స్థానానికి చేరుకున్నాడు.ఆ జాబితాకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

భారత్ తరపున టీ20 మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా జస్ప్రీత్ బుమ్రా అవతరించి, టాప్-3 లో నిలిచాడు.

ఇంతకుముందు ఈ స్థానంలో హార్దిక్ పాండ్యా ఉండేవాడు.టీ20 మ్యాచ్ లలో 70 వికెట్లు తీసిన బుమ్రా గాయం కారణంగా 327 రోజులపాటు ఆటకు దూరంగా ఉన్నాడు.

"""/" / ఆ సమయంలో వెస్టిండీస్ తో( West Indies ) జరిగిన టీ20 సిరీస్ లో హార్థిక్ పాండ్యా, బుమ్రా ను అధిగమించి 73 వికెట్లతో భారత్ తరపున అత్యధిక టీ20 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా అవతరించాడు.

అయితే తాజాగా ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ లలోను 2,2 వికెట్లు తీశాడు.

దీంతో అంతర్జాతీయ టీ20లలో మొత్తంగా 74 వికెట్లు తీసిన బుమ్రా, పాండ్యా ను అధిగమించి మళ్లీ మూడవ స్థానంలోకి వచ్చాడు.

దీంతో హార్థిక్ పాండ్య నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. """/" / భారత్ తరపున అంతర్జాతీయ టీ20 లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్( Yuzvendra Chahal ) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇప్పటివరకు చాహల్ 96 వికెట్లు పడగొట్టి ఈ రికార్డ్ సాధించాడు.ఈ జాబితాలో రెండవ స్థానంలో భువనేశ్వర్ కుమార్( Bhuvneshwar Kumar ) ఉన్నాడు.

భువనేశ్వర్ కుమార్ టీ20 లలో 90 వికెట్లు తీశాడు.తాజాగా మూడవ స్థానంలో బుమ్రా నిలిచాడు.

మంత్రి గారి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు వార్నింగ్