సంతాన సమస్యలకు చెక్ పెట్టే సొరకాయ గింజలు..ఎలా తీసుకోవాలంటే?
TeluguStop.com
పెళ్లైన వెంటనే పిల్లలు పుట్టాలని దంపతులు కోరుకోవడం సర్వ సాధారణం.ఎందుకంటే, పిల్లలతోనే దాంపత్య జీవితం పరిపూర్ణం అవుతుంది.
అయితే నేటి ఆధునిక కాలంలో ఎందరో దంపతులు సంతాన సమస్యలను ఎదుర్కొంటారు.స్త్రీ, పురుషుల్లో కొద్దిపాటి లోపాల ఉండటం వల్ల సంతానా లేమి సమస్య ఏర్పడుతుంది.
సంతాన లేమి కారణంగా ఎంతో మంది దంపతులు ఒక అసంపూర్ణమైన జీవితం గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే పిల్లలు పుట్టేందుకు హాస్పటల్స్ చుట్టూ, దేవాలయాల చుట్టూ తిరుగుతుంటారు.అయితే సంతాన సమస్యలను దూరం చేయడంలో కొన్ని కొన్ని ఆహారాలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
అలాంటి వాటిలో సొరకాయ గింజలు ముందుంటాయి.ఆరోగ్య వంతమైన కూరగాయల్లో సొరకాయ ఒకటి.
కానీ, చాలా మంది సొరకాయను అస్సలు ఇష్టపడరు.ముఖ్యంగా పిల్లలు సొరకాయ పేరు చెబితేనే పారి పోతుంటారు.
కానీ, సొరకాయలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. """/" /
అలాగే సొరకాయ గింజల్లో కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ ఇలా బోలెడు పోషకాలు ఉన్నాయి.
అటు వంటి సొరకాయ గింజలు సంతాన సమస్యలతో బాధ పడే వారికి అద్భుతంగా సహాయపడతాయి.
ముందుగా సొరకాయ గింజలను తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి.అనంతరం వీటిలో ధనియాలు, జీలకర్ర మరియు చిటికెడు ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
ఈ పౌడర్‌ను ప్రతి రోజు రైస్‌లో కలుపుకుని మూడు లేదా నలుగు ముద్దలు తీసుకోవాలి.
ఇలా క్రమంగా చేస్తే లైంగిక శక్తి పెరుగుతుంది.సొరకాయతో తయారు చేసుకున్న ఈ పౌడర్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తిని పెంచి సంతానోత్పత్తి అవకాశాలను రెట్టింపు చేస్తాయి.
అలాగే పురుషులలో వీర్య వృద్ధి, లైంగిక కోరికలు పెరగుతాయి.దాంతో సంతాన లేమి సమస్య దూరం అవుతుంది.
ఆపరేషన్ బ్లూ స్టార్ … నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి