పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరగటంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు తన పార్టీ కి చెందిన వారితో చంద్రబాబే చేపించి.

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేవనెత్తారు అని పొలిటికల్ మైలేజ్ సంపాదించాలని.కక్కుర్తి రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే తాజా ఘటన లపై.మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరును ఖండించారు.ప్రజాస్వామ్యంలో ఇటువంటి భాష సరికాదని పేర్కొన్నారు.

ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏకవచనంతో పరుష పదజాలంతో.మాట్లాడితే ఆ భాషను సమర్థించేలా.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడటం దారుణమని అన్నారు.సీఎం జగన్ ని ఉద్దేశించి పట్టాభి మాట్లాడిన భాషను పవన్ సమర్థించడం పట్ల బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

అంత మాత్రమే కాక కేంద్రం నుండి బలగాలను పంపాలని కోరడం ఏంటి అని ప్రశ్నించారు.

అదే రీతిలో ఒకవైపు బీజేపీతో మిత్రత్వం కొనసాగిస్తూనే మరోవైపు చంద్రబాబు పార్టనర్ గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని .

అందువల్లే తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు ఇది సిగ్గుచేటు అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా చంద్రబాబు నాయుడుని సమర్థిస్తూ.మాట్లాడటం వెనకాల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని బొత్స పేర్కొన్నారు.

TDP Vs YCP : టీడీపీ వర్సెస్ వైసీపీ.. రాజమండ్రిలో పొలిటికల్ హీట్