బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ సమానమే..: గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ సమానమేనని తెలిపారు.తాను ఏ పార్టీలో చేరనని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే సంస్థాగత నిర్మాణం లేకనే బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఓడిపోయిందని పేర్కొన్నారు.

కేసీఆర్( KCR ) దక్షిణ తెలంగాణను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల పరిస్థితి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.పార్టీ అధిష్టానంపై నమ్మకం లేకనే నేతలు పార్టీని వీడుతున్నారన్నారు.

ఎమ్మెల్సీల అనర్హత విషయంలో చట్టబద్ధంగా వ్యవహరిస్తానని ఆయన తెలిపారు.అయితే ప్రస్తుతం గుత్తా సుఖేందర్ మాట్లాడిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఒకేసారి ఆరు ఫ్లాట్స్ ను కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఏం జరిగిందంటే?