వైసీపీని వీడనున్న బొప్పన భవకుమార్..!!
TeluguStop.com
విజయవాడ నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్( Boppana Bhavakumar ) పార్టీని వీడనున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు.టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ను బొప్పన కలిశారు.
కాగా ఈ సమావేశానికి బొప్పనతో పాటు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ వెళ్లారు.
వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న భవకుమార్ ఇప్పటికే వంగవీటి రాధ సహా ఇతర నేతలతో సమావేశమై చర్చించారు.
మరోవైపు వైసీపీ పెద్దలు బొప్పనతో బుజ్జగింపులు జరిపినా ప్రయోజనం లేదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వైసీపీని వీడనున్న బొప్పన భవకుమార్ టీడీపీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది.
స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఫోన్ చేసిన బాలయ్య.. అసలేం జరిగిందంటే?