కేంద్ర హోం మంత్రితో భేటీ కానున్న బూర నర్సయ్య గౌడ్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భేటీ కానున్నారు.

తాజాగా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బిజెపిలోకి వెళ్ళనున్నారని సమాచారం.రాజీనామా కారణాలపై సీఎం కేసీఆర్ కు ఇప్పటికే నరసయ్య గౌడ్ లేఖ రాశారు .

ఈ క్రమంలోనే నిన్న రాత్రి జేపీ నడ్డాను ఆయన కలిశారు.త్వరలో భువనగిరి పార్లమెంట్ పరిధిలో బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది.

ఈ సభలోబూర నర్సయ్య గౌడ్ ను పార్టీలో చేర్చుకోవాలని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న నరసయ్య గౌడ్ రేపు హైదరాబాదుకు తిరిగి రానున్నారు.

అస్సలు తగ్గేదేలే.. పుష్ప 2 పై వెంకీ మామ క్రేజీ రివ్యూ… ఏమన్నారంటే?