రాయ్పూర్ వన్డేలో ఇండియన్ బౌలర్ల విజృంభణ
TeluguStop.com
రాయ్పూర్ వన్డేలో ఇండియన్ బౌలర్లు విజృంభిస్తున్నారు.భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
కివీస్ ఆటగాళ్లకు ఇండియన్ పేసర్లు చెమటలు పుట్టిస్తున్నారు.దీంతో వరుసగా ఫెవిలియన్ కు క్యూ కడుతున్నారు.
15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది కివీస్.10.
2 ఓవర్లలోనే న్యూజిలాండ్ టాపార్డర్ కుప్పకూలింది.ఈ క్రమంలోనే ఐదుగురు బ్యాట్ మెన్స్ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.
షమీ ఇన్నింగ్స్ ఐదో బాల్ కే న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేసి దెబ్బకొట్టాడు.
ఐదో ఓవర్ లో అద్భుత ఔట్ స్వింగర్ తో సిరాజ్.హెన్రీ నికోల్స్ (2)ను పెవిలియన్ చేర్చాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే డారిల్ మిచెల్ (1) షమీ రిటర్న్ క్యాచ్ తో పెవిలియన్ చేర్చాడు.
అదేవిధంగా పదో ఓవర్లో డెవాన్ కాన్వే (7)ను కూడా హార్దిక్ పాండ్యా రిటర్న్ క్యాచ్ పట్టాడు.
శార్దూల్ ఠాకూర్.కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (1)ను ఐదో వికెట్ గా ఔట్ చేయగా.
డ్రింక్స్ విరామ సమయానికి కివీస్ 14 ఓవర్లలో 28/5 స్కోరుతో నిలిచింది.కాగా తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ ను ఆదర్శంగా తీసుకుంటే అందరూ పాన్ ఇండియా హీరోలే అవుతారా..?