‘భగవంత్ కేసరి’ మానియా.. అక్కడ బుకింగ్స్ స్టార్ట్!
TeluguStop.com
నందమూరి నటసింహం బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ''భగవంత్ కేసరి'' ( Bhagavanth Kesari ).
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంత ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇక దసరా బరిలో బాలయ్య ఈ సినిమాతో ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటి వరకు పెద్దగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోయినా కూడా వచ్చిన కంటెంట్ మాత్రం సినిమాపై హైప్ పెంచేసాయి.
"""/" /
ఇటీవలే ఫస్ట్ సింగిల్( Bhagavanth Kesari First Single ) రిలీజ్ చేయగా ఆకట్టుకుంది.
ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది.ఇక నిన్నటితో ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి అయ్యింది.
దీంతో మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది.యూఎస్ లోని కొన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
అక్కడ మధ్యాహ్నం షోస్ తోనే భగవంత్ కేసరి మ్యానియా స్టార్ట్ కానుంది.బాలయ్య గత సినిమా వీరసింహారెడ్డికి బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీమియర్స్ రాగా ఈ సినిమాపై మరింత హైప్ పెరగడంతో ఆ కలెక్షన్స్ ను బీట్ చేసే అవకాశం కూడా ఉంది.
ఇక దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
"""/" /
కాగా బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల ( Sreeleela), విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్స్ అందుకున్న బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు.
చూడాలి అనిల్ ఎలాంటి సక్సెస్ ఇస్తాడో.
కన్నడంలో ప్రసంగం .. కెనడా ప్రధాని రేసులో దూకిన భారత సంతతి ఎంపీ